నన్ను అలా చేసిన అతన్ని లాగి చెంపపై కొట్టా‌: సోనియా అగర్వాల్

ABN , First Publish Date - 2021-12-08T02:02:11+05:30 IST

నేను రఫ్‌ అండ్‌ టఫ్‌ టైపు.. నన్ను హేళన చేసినందుకు లాగి చెంపపై కొట్టాను. నా మాతృభాష పంజాబీ. కానీ, తమిళం, తెలుగు, కన్నడం, మలయాళ భాషల్లో దాదాపు 40కు పైగా

నన్ను అలా చేసిన అతన్ని లాగి చెంపపై కొట్టా‌: సోనియా అగర్వాల్

తనకు చిన్నతనం నుంచే సంగీతం అంటే ఎంతో ఇష్టమని, అందుకే సొంతంగా ఒక పాట పాడాలన్న కోరిక అప్పటి నుంచే ఉందని హీరోయిన్‌ సోనియా అగర్వాల్‌ పేర్కొంది. పైగా తన సోదరుడు సంగీత దర్శకుడని, అందువల్ల తాను గాయనిగా పాటపాడి, నటించాలని ఉందని తెలిపింది. ఆమె నటించిన ద్విభాషా చిత్రం ‘గ్రాండ్‌మా’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. 


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో టీచర్‌ పాత్ర పోషించాను. సాధారణంగా అనేక చిత్రాల్లో నా పాత్రలన్నీ అమాయకురాలిగా ఉంటాయి. కానీ, నేను రఫ్‌ అండ్‌ టఫ్‌ టైపు. చదువుకునే రోజుల్లో ఓ విద్యార్థి నన్ను హేళన చేసినందుకు లాగి చెంపపై కొట్టాను. నా మాతృభాష పంజాబీ. కానీ, తమిళం, తెలుగు, కన్నడం, మలయాళ భాషల్లో దాదాపు 40కు పైగా చిత్రాల్లో నటించాను. నాకు ఒకే ఒక తమ్ముడు ఉన్నాడు. ఆయన సంగీత దర్శకుడుగా కొనసాగుతున్నాడు. మున్ముందు అవకాశం లభిస్తే మాత్రం ఖచ్చితంగా గాయనిగా నటిస్తాను’’ అని సోనియా అగర్వాల్‌ చెప్పుకొచ్చింది.

Updated Date - 2021-12-08T02:02:11+05:30 IST