అవకాశాల కోసం ఆ పని చేయను: తాప్సీ

ABN , First Publish Date - 2022-01-31T23:15:55+05:30 IST

ఒకపుడు తన వద్దకు వచ్చిన ప్రతి సినిమాలోనూ నటించానని, ఇపుడు తనకు నచ్చిన, తాను ఎంపిక చేసిన చిత్రాల్లోనే నటిస్తున్నానని హీరోయిన్‌ తాప్పీ వెల్లడించింది. తెలుగు, తమిళ, బాలీవుడ్‌ పరిశ్రమల్లో

అవకాశాల కోసం ఆ పని చేయను: తాప్సీ

ఒకపుడు తన వద్దకు వచ్చిన ప్రతి సినిమాలోనూ నటించానని, ఇపుడు తనకు నచ్చిన, తాను ఎంపిక చేసిన చిత్రాల్లోనే నటిస్తున్నానని హీరోయిన్‌ తాప్పీ వెల్లడించింది. తెలుగు, తమిళ, బాలీవుడ్‌ పరిశ్రమల్లో హీరోయిన్‌గా ఉన్న తాప్సీ గత యేడాది ‘అన్నాబెల్‌ సేతుపతి’ చిత్రంలో నటించింది. ఇపుడు క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ బయోగ్రఫీతో పాటు నాలుగు హిందీ, తెలుగు, తమిళం భాషల్లో ఒక్కో చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. 


దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘‘గతంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న తపన ఉండేది. ఇపుడు ఎంపిక చేసిన చిత్రాల్లోనే నటిస్తున్నాను. నేను నటించే చిత్రాలను ప్రేక్షకులు ఆదరించడం వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నాను. ఇకపై సినిమా అవకాశాల కోసం వెంపర్లాడను. ఒకవేళ సినిమా అవకాశాలు తగ్గిపోతే మంచి నిర్మాతలను వెతుక్కుంటూ వెళతాను. నా కోసం ఆ పని ఎవరూ చేయరు. నేను స్వతంత్ర జీవిని. అందుకే నా పనులు నేనే చేసుకుంటాను’’ అని స్పష్టం చేసింది. 

Updated Date - 2022-01-31T23:15:55+05:30 IST