I am Ilayaraja..: ఇళయరాజా అనే నేను...

ABN , First Publish Date - 2022-07-26T14:39:42+05:30 IST

సంగీత దర్శకుడు ఇళయరాజా సోమవారం రాజ్యసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన

I am Ilayaraja..: ఇళయరాజా అనే నేను...

                         - రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం 


అడయార్‌(చెన్నై), జూలై 25: సంగీత దర్శకుడు ఇళయరాజా(Ilayaraja) సోమవారం రాజ్యసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన తమిళంలోనే దేవుడిపై ప్రమాణం చేశారు. అయితే, ఈయన ప్రమాణం చేసే సమయంలో ‘దేవుడు’ అనే పదాన్ని బలంగా నొక్కి పలికారు. ఇదిలావుండగా ఆదివారం ఢిల్లీకి వెళ్ళిన ఆయనకు విమానాశ్రమం(Airport)లో ఘనస్వాగతం లభించింది. రాత్రికి ఢిల్లీ(Delhi)లో బస చేసి, సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, రాష్ట్రపతి కోటాలో ఇళయరాజాను రాజ్యసభ సభ్యుడుగా కేంద్ర ప్రభుత్వం నామినేట్‌ చేసిన విషయం తెల్సిందే. 

Updated Date - 2022-07-26T14:39:42+05:30 IST