Hyper aadi: దాచేద్దాం.. దోచేద్దాం.. ఆ టైపు కాదు ఆయన!

ABN , First Publish Date - 2022-07-11T23:08:23+05:30 IST

‘‘ఈ రోజుల్లో ఎలాంటి వ్యక్తినైనా డబ్బు మార్చేస్తుంది. పవన్‌కల్యాణ్‌కు మాత్రం డబ్బు మీద ఏ మాత్రం ఆసక్తి లేదు. ‘డబ్బు సంపాదిద్దాం, దాచేద్దాం.. దోచేద్దాం, లగ్జరీగా బతికేద్దాం’ అన్న ఆలోచన ఆయన ఆయనకు లేదు. అలాంటి వ్యక్తి కచ్చితంగా ఎదుటివారికి మంచి చేయాలనే అనుకుంటాడు.

Hyper aadi: దాచేద్దాం.. దోచేద్దాం.. ఆ టైపు కాదు ఆయన!

‘‘ఈ రోజుల్లో ఎలాంటి వ్యక్తినైనా డబ్బు మార్చేస్తుంది. పవన్‌కల్యాణ్‌కు(pawan kalyan) మాత్రం డబ్బు మీద ఏ మాత్రం ఆసక్తి లేదు. ‘డబ్బు సంపాదిద్దాం, దాచేద్దాం.. దోచేద్దాం, లగ్జరీగా బతికేద్దాం’ అన్న ఆలోచన ఆయన ఆయనకు లేదు. అలాంటి వ్యక్తి కచ్చితంగా ఎదుటివారికి మంచి చేయాలనే అనుకుంటాడు. ఆయనలో మంచితనానికి నేను అభిమానిని. ఎప్పటికీ పవన్‌ను అభిమానిస్తూనే ఉంటాను’’ అని హైపర్‌ (Aadi)ఆది అన్నారు. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్‌కల్యాణ్‌ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ‘‘వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారా’’ అని ప్రశ్నించగా.. ‘అలాంటిది ఏమీ లేదు’ అని ఆది చెప్పారు. (Hyper aadi about pawan kalyan)


‘‘పవన్‌కల్యాణ్‌ అంటే అమితమైన ఇష్టం. క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం నేను చిన్నవర్క్‌ చేస్తున్నా. దాని కోసం నాలుగు రోజులు ఆయన ఇంటికి వెళ్లి పర్సనల్‌గా పవన్‌ని కలిశా. ఒక సినిమా చేస్తే వచ్చే ఆదాయాన్ని ఆయన కౌలు రైతులకు సాయం చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఓ సినిమా చేస్తే సుమారు 30 నుంచి 50 కోట్లు వస్తే ఆ మొత్తాన్ని పేదలకు సాయం చేయడానికి, పార్టీ కోసం పని చేస్తున్న వారికి పంచేస్తారు. ఆయన వ్యక్తిత్వం అలాంటిది. అందరి మంచి కోరుకునే వ్యక్తికి మంచి జరిగితే మనం ఎంతో ఆనందిస్తాం. అదే నా భావన కూడా’’ అని హైపర్‌ ఆది చెప్పుకొచ్చారు. ఈ ఏడాది విడుదలైన ‘భీమ్లానాయక్‌’ చిత్రంలో ఆది ఓ సన్నివేశంలో మెరిశారు. పంచ్‌లతో ఫేమస్‌ అయిన ఆది ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి ఓ చిన్న వర్క్‌ చేస్తున్నానని చెప్పడం ఆసక్తి రేకెత్తిస్తోంది. సినిమాలో ఏదన్నా కీలక పాత్రలో ఆది నటిస్తున్నారా లేదా.. రైటింగ్‌ వైపు క్రిష్‌కు హెల్ప్‌ చేస్తున్నాడా అన్నది తెలియాల్సి ఉంది. (Krish)


Updated Date - 2022-07-11T23:08:23+05:30 IST