Akshay Kumar : బాలీవుడ్ ‘రాక్షసుడు’ ఎలా ఉన్నాడంటే !

ABN , First Publish Date - 2022-09-04T21:26:47+05:30 IST

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) కెరీర్ మొత్తంలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమా ‘రాక్షసుడు’ (Rakshasudu). తమిళ చిత్రం ‘రాక్షసన్’ (Rakshasan) కిది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్‌కు రామ్ కుమార్ (Ramkumar) దర్శకుడు కాగా.. తెలుగులో దీన్ని రమేశ్ వర్మ (Ramesh Varma) తెరకెక్కించాడు.

Akshay Kumar : బాలీవుడ్ ‘రాక్షసుడు’ ఎలా ఉన్నాడంటే !

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) కెరీర్ మొత్తంలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమా ‘రాక్షసుడు’ (Rakshasudu). తమిళ చిత్రం ‘రాక్షసన్’ (Rakshasan) కిది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్‌కు రామ్ కుమార్ (Ramkumar) దర్శకుడు కాగా.. తెలుగులో దీన్ని రమేశ్ వర్మ (Ramesh Varma) తెరకెక్కించాడు. ఇదే  చిత్రాన్ని బాలీవుడ్ లో కాస్తంత ఆలస్యంగా రీమేక్ చేశారు. సినిమా పేరు ‘కట్‌పుత్లీ’ (CuttPutlli).  ఇటీవలి కాలంలో థియేట్రికల్‌గా సక్సెస్ సాధించడంలో తడబడుతున్న అక్షయ్ కుమార్ (Akshay Kumar) హీరోగా నటించాడు. అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) స్థానాన్ని రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preeth Singh) భర్తీ చేయగా.. కేస్టింగ్ మొత్తం అక్కడి ఆడియన్స్‌కు తగ్గట్టుగా మార్చేశారు. డిస్నీ‌ప్లస్ హాట్ స్టార్ లో డైరెక్ట్ గా విడుదలైంది ఈ సినిమా. 


కథ బ్యాక్ డ్రాప్.. హిమాచల్ ప్రదేశ్‌లోని కసౌలి పట్నానికి షిఫ్ట్ అయింది. టీనేజ్ అమ్మాయిలు వరుసగా మర్డర్ అవుతుండడంతో.. డిపార్ట్‌మెంట్ లోని ఇంటెలిజెంట్ పోలీసాఫీసర్ రంగంలోకి దిగుతాడు. అదే మెయిన్ పాయింట్‌ను తీసుకున్నా.. సైకో కిల్లర్ ఫ్లాష్ బ్యాక్ ను పూర్తిగా తగ్గించేసి.. క్లైమాక్స్ లో స్పీడ్ పెంచారు. ఒరిజినల్ వెర్షన్ తో పోలిస్తే రన్‌టైమ్‌ను కూడా బాగా తగ్గించేశారు. టెంప్లెట్‌ను కొంత మేర ఫాలో అయినప్పటికీ.. రాక్షసుడులోని ఫీల్ ను క్యారీ చేయడంలో ‘కట్‌పుత్లీ’ పూర్తిగా తడబడింది. దర్శకుడు రంజిత్ యం. తివారీ (Ranjith M Thiwari) దర్శకత్వ ప్రతిభ కొన్ని సన్నివేశాలకే పరిమితమయింది. 


ఇక తమిళ, తెలుగు వెర్షన్స్‌కు ప్రాణం పోసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఏమాత్రం మ్యాచ్ చేయలేకపోయింది హిందీ వెర్షన్. చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన జూలియస్ పకియం (Julias Pakiyam) దీనికి పనిచేశాడు. అయితే గిబ్రాన్ (Gibran) దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేకపోయాడు. లేడీ పోలీసాఫీసర్ పాత్రను కూడా మార్చేయడంతో హిందీ వెర్షన్ తేడా కొట్టింది. ఫైనల్ గా చెప్పాలంటే.. ‘కట్‌పుత్లీ’ రాక్షసుడు చిత్రం స్థాయిని ఏ మాత్రం అందులేకపోయింది. యంగ్ హీరో చేయాల్సిన పాత్రను అక్షయ్ కుమార్ చేయడం కూడా దీనికి మైనస్ అని చెబుతున్నారు. 

Updated Date - 2022-09-04T21:26:47+05:30 IST