డబులైన Vikram Vedha బడ్జెట్..!?.. అక్కడ షూటింగ్ చేసేందుకు ఆ హీరో నిరాకరించడంతో..

ABN , First Publish Date - 2022-06-29T17:56:40+05:30 IST

బాలీవుడ్‌ నటులు హృతిక్ రోషన్ (Hrithik Roshan), సైఫ్ అలీ ఖాన్‌ (Saif Ali Khan) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘విక్రమ్ వేద’...

డబులైన Vikram Vedha బడ్జెట్..!?.. అక్కడ షూటింగ్ చేసేందుకు ఆ హీరో నిరాకరించడంతో..

బాలీవుడ్‌ నటులు హృతిక్ రోషన్ (Hrithik Roshan), సైఫ్ అలీ ఖాన్‌ (Saif Ali Khan) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘విక్రమ్ వేద (Vikram Vedha)’. ఆర్ మాధవన్, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో నటించగా 2017లో విడుదలై మంచి విజయం సాధించిన తమిళ మూవీ ‘విక్రమ్ వేద’కి ఇది రిమేక్. అదే పేరుతో హిందీలోనూ తెరకెక్కుతోంది. కోలీవుడ్‌లో మూవీని తెరకెక్కించిన రచయిత, దర్శకుల ద్వయం పుష్కర్ (Pushkar), గాయత్రి (Gayatri) ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.


ఈ మూవీలో సైఫ్ పోలీసుగా నటిస్తుండగా.. హృతిక్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్ర నిర్మాతలు చాలా తక్కువ బడ్జెట్‌లో ఈ సినిమాని పూర్తి చేసేందుకు ప్లాన్ చేశారు. అందుకే ఈ మూవీ సెట్‌ని యూపీలో వేసేందుకు సిద్ధమయ్యారు. కానీ.. అక్కడ షూటింగ్ చేసేందుకు హృతిక్ నిరాకరించాడని తెలుస్తోంది. అంతేకాకుండా.. ఆ సెట్‌లో దుబాయ్‌లో వేయాల్సిందిగా సూచించాడని టాక్. కొన్ని కారణాల వల్ల సినిమా షెడ్యూల్‌లో భారీ మార్పులు, అదనపు సెట్ కోసం ఇప్పటికే సినిమా బడ్జెట్‌ను రెండుసార్లు పెంచాల్సి వచ్చింది. దీంతో చాలా తక్కువ బడ్జెట్ పూర్తి చేద్దామని ఈ మూవీ ఖర్చు రెట్టింపు అవుతోందని సమాచారం. నిజానికి ఈ మూవీ అనుకున్నదానికంటే ఎక్కువ బడ్జెట్‌తో తెరకెక్కుతుండగా.. తాజా పరిణామాలతో ఆయన గత చిత్రాలు ‘వార్’, ‘మొహంజాదారో’ బడ్జెట్‌ను మించిపోతున్నట్లు తెలుస్తోంది.


పుష్కర్, గాయత్రి తమిళ ‘విక్రమ్ వేద’ కేవలం రూ.11 కోట్ల బడ్జెట్‌తో రూపొందించగా.. విడుదలైన తర్వాత దాదాపు రూ.60 కోట్ల కలెక్షన్లని సాధించింది. భారతీయ పురాతన కథ విక్రమార్కుడు, బేతాళుడు ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో ఓ నిజాయితీ, టఫ్ పోలీసు ఆఫీసర్, అంతే టఫ్ అయిన గ్యాంగ్‌స్టర్ మధ్య జరిగే కథే ఈ చిత్రం. నిజానికి ఈ మూవీని సెప్టెంబర్ 30న విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

Updated Date - 2022-06-29T17:56:40+05:30 IST