హృతిక్‌తో డేటింగ్‌ చేస్తున్న సబా ఆజాద్.. ఆమె గురించిన ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు..

ABN , First Publish Date - 2022-02-02T22:41:51+05:30 IST

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్‌.. గత కొన్ని రోజులుగా ఓ అజ్ఞాత సుందరితో డేటింగ్ చేస్తున్నాడు.

హృతిక్‌తో డేటింగ్‌ చేస్తున్న సబా ఆజాద్.. ఆమె గురించిన ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు..

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్‌.. గత కొన్ని రోజులుగా ఓ అజ్ఞాత సుందరితో డేటింగ్ చేస్తున్నాడు. తాజాగా ఆమెతో కలిసి డిన్నర్ చేసేందుకు బయటికి వెళ్తూ కెమెరాల కంటికి చిక్కాడు. ఆ ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. హృతిక్ రోషన్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ క్రమంలో హృతిక్‌తో కలిసి డిన్నర్‌కు వెళ్లిన అమ్మాయి ఎవరు అనే విషయం నెటిజన్లు ఆరాలు తీశారు. చివరకు ఆమె ఓ అప్ కమింగ్ బ్యూటీ సబా ఆజాద్ అని కనిపెట్టారు. తాజాగా ఆమెకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు బయటికొచ్చాయి. 


సబా ఆజాద్ గతంలోనే ‘దిల్ కబడ్డీ’, ‘ముఝసే ఫ్రెండ్ షిప్ కరోగీ’ చిత్రాల్లో నటించింది. నసీరుద్దీన్ షా కొడుకు ఇమాద్‌తో 2013లో డేటింగ్ చేసింది. తర్వాత ఈ జంట దాదాపు 7ఏళ్ల పాటు రిలేషన్ షిప్‌ను కొనసాగించింది. కానీ, అనివార్య కారణాల వల్ల ఆ బంధానికి బీటలు వారింది. దీంతో ఈ జంట 2020లో విడిపోయింది. కొన్నాళ్లకు ఆమెకు ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా హృతిక్ పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో గత కొన్ని నెలలుగా హృతిక్‌తో డేటింగ్ చేస్తోంది.


 ఈ వార్తలపై హృతిక్, సబా ఇప్పటివరకు స్పందించలేదు. సబా ఆజాద్ తాజాగా ‘రాకెట్ బాయ్స్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. సోనీ లివ్‌లో ఈ సిరీస్ ఫిబ్రవరి 4 నుంచి ప్రసారం కాబోతోంది. ఈ షోలో జిమ్ సర్భ్, ఇష్వక్ సింగ్, రెజీనా కసాండ్రా నటించారు. హోమీ జే. బాబా పాత్రలో జిమ్ సర్భ్ కనిపంచనుండగా, విక్రమ్ సారా‌భాయ్ పాత్రలో ఇష్వక్ సింగ్ నటించారు. యువకుడైన హోమీ బాబా లవర్ పాత్రలో సబా కనిపించనుంది.

Updated Date - 2022-02-02T22:41:51+05:30 IST