Hrithik Roshan: అబద్ధపు ప్రచారాలు చేయకండి

ABN , First Publish Date - 2022-11-20T23:06:46+05:30 IST

సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికి ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan). బాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో అతడు ఒకరు.

Hrithik Roshan: అబద్ధపు ప్రచారాలు చేయకండి

సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికి ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan). బాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో అతడు ఒకరు. మొదటి భార్య సుసానే ఖాన్‌ (Sussanne Khan) కు హృతిక్ చాన్నాళ్ల క్రితమే విడాకులిచ్చాడు. అనంతరం అప్‌కమింగ్ బ్యూటీ, సింగర్ సబా ఆజాద్ (Saba Azad)తో డేటింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఈ జంట గతంలో అనేక సార్లు మీడియా కంట పడింది. కరణ్ జోహార్ ఇచ్చిన పార్టీకి కూడా వీరిద్దరు కలసి హాజరయ్యారు. తాజాగా హృతిక్.. సబా కోసం రూ.100కోట్లను ఖర్చు చేసి ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశాడని బాలీవుడ్ మీడియా తెలిపింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ గ్రీకు వీరుడు ఆ రూమర్స్‌పై స్పందించాడు. 


ముంబై మన్నత్ బిల్డింగ్‌లో ఖరీదైన అపార్ట్‌మెంట్స్‌ను హృతిక్ రోషన్ కొనుగోలు చేశాడని బీ టౌన్ మీడియా తెలిపింది. సబా కోసం రూ.100కోట్లు చెల్లించి రెండు అపార్ట్‌మెంట్స్‌ను సొంతం చేసుకున్నాడని పలు వెబ్‌సైట్స్ కథనాలు రాశాయి. ఈ నేపథ్యంలో హృతిక్ రోషన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదు. అవన్ని అబద్ధమే. సెలబ్రిటీగా నా గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరికి ఉంటుందని నాకు తెలుసు. రిపోర్టింగ్ అనేది బాధ్యయుతమైనది. ఇటువంటి ఉద్యోగంలో తప్పుడు సమాచారాన్ని మనం ప్రజలకు చేరవేయకూడదు’’ అని హృతిక్ చెప్పాడు. కెరీర్ పరంగా సబా ఆజాద్, హృతిక్ రోషన్ చాలా బిజీగా ఉన్నారు. సబా ఆజాద్ చేతిలో ‘రాకెట్ బాయ్స్ 2’, ‘ఫ్రంట్ పేజ్ ’వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. హృతిక్ రోషన్ కూడా వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్నాడు. తాజాగా ‘విక్రమ్ వేద’ (Vikram Vedha) లో నటించాడు. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, రాధికా ఆప్టే తదితరులు  కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం అతడు ‘ఫైటర్’ (Fighter) లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand) దర్శకత్వం వహిస్తున్నాడు. ఏరియల్ యాక్షన్ థ్రిలర్‌గా తెరకెక్కిస్తున్నాడు. దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రం 2024 రిపబ్లిక్ డే సందర్భంగా థియేటర్స్‌లోకి రానుంది.



Updated Date - 2022-11-20T23:06:46+05:30 IST