Hrithik Roshan: ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో ప్రేయసితో కొత్త జీవితం

ABN , First Publish Date - 2022-11-18T22:54:37+05:30 IST

బాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో హృతిక్ రోషన్ (Hrithik Roshan) ఒకరు. సినీ నేపథ్యం ఉన్నకుటుంబం నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికి ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నాడు.

Hrithik Roshan: ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో ప్రేయసితో కొత్త జీవితం

బాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో హృతిక్ రోషన్ (Hrithik Roshan) ఒకరు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికి ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నాడు. హృతిక్ చాన్నాళ్లుగా అప్‌కమింగ్ బ్యూటీ, సింగర్ సబా ఆజాద్ (Saba Azad) తో డేటింగ్ చేస్తున్నాడు. ఈ జంట గతంలో అనేక సార్లు మీడియా కంట పడింది. కరణ్ జోహార్ ఇచ్చిన పార్టీకి కూడా వీరిద్దరు కలసి హాజరయ్యారు. కానీ, తామిద్దరం రిలేషన్‌షిప్‌‌లో ఉన్నామని ఈ జంట ఎప్పుడు తెలపలేదు. బాలీవుడ్ మీడియాలో హృతిక్, సబాకు సంబంధించిన ఓ అప్‌డేట్ తెగ షికార్లు కొడుతుంది. త్వరలోనే వీరిద్దరు కలసి జీవితాన్ని ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది.   


ముంబై మన్నత్ బిల్డింగ్‌లో ఖరీదైన అపార్ట్‌మెంట్స్‌ను హృతిక్ రోషన్ కొనుగోలు చేశాడట. దాదాపుగా రూ.100కోట్లు చెల్లించి రెండు అపార్ట్‌మెంట్స్‌ను సొంతం చేసుకున్నాడని సమాచారం. ఈ రెండు అపార్ట్‌మెంట్స్ మూడు ఫ్లోర్‌లలో విస్తరించి ఉన్నాయని తెలుస్తోంది. జుహు- వెర్సోవా లింక్ రోడ్డులో ఈ అపార్ట్‌మెంట్స్ ఉన్నాయట. సముద్ర తీరానికి దగ్గరలో ఉండటంతో వీటికి భారీ ధరను చెల్లించాల్సి వచ్చిందట. ఈ బిల్డింగ్‌లోనే హృతిక్ రోషన్, సబా ఆజాద్ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఇక హృతిక్ రోషన్ కెరీర్ విషయానికి వస్తే.. ‘విక్రమ్ వేద’ (Vikram Vedha) లో చివరగా నటించాడు. పుష్కర్-గాయత్రి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్, రాధికా ఆప్టే కీలక పాత్రలు పోషించారు. హృతిక్ ప్రస్తుతం ‘ఫైటర్’ (Fighter) లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand) దర్శకత్వం వహిస్తున్నాడు. ఏరియల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందుతుంది. దీపికా పదుకొణె, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Updated Date - 2022-11-18T22:54:37+05:30 IST