Hrithik Roshan: ఇప్పటికి యాక్ట్ చేస్తున్నానంటే అద్భుతమే

ABN , First Publish Date - 2022-09-18T01:34:34+05:30 IST

సినీ కుటుంబం నుంచి వచ్చినప్పటికి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్న నటుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan). ప్రస్తుతం బాలీవుడ్‌లోనే స్టార్ హీరోగా మారిపోయాడు. యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్

Hrithik Roshan: ఇప్పటికి యాక్ట్ చేస్తున్నానంటే అద్భుతమే

సినీ కుటుంబం నుంచి వచ్చినప్పటికి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్న నటుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan). ప్రస్తుతం బాలీవుడ్‌లోనే స్టార్ హీరోగా మారిపోయాడు. యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యాడు. తాజాగా హృతిక్ నటించిన సినిమా ‘విక్రమ్ వేద’ (Vikram Vedha). రాధికా ఆప్టే, సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలు పోషించారు. కోలీవుడ్ హిట్ మూవీ ‘విక్రమ్ వేద’ కు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. హిందీ వెర్షన్‌ను అదే టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్‌కు దర్శకత్వం వహించిన పుష్కర్- గాయత్రి (Pushkar Gayathri)నే రీమేక్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా హృతిక్ ఆసక్తికర విషయాన్ని చెప్పాడు. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వక ముందు తాను ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించాడు. తాను యాక్షన్, డ్యాన్స్‌కు పనికిరానని డాక్టర్స్ చెప్పరన్నాడు.      


హృతిక్ రోషన్ ‘కహో నా ప్యార్ హై’ (Kaho Naa Pyaar Hai) తో బీ టౌన్‌కు ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో ఓవర్ నైట్ సెన్సేషన్‌గా మారిపోయాడు. ఈ సినిమాకు ముందు హృతిక్‌కు ఆరోగ్యం బాగాలేదని డాక్టర్స్ చెప్పారు. అందువల్ల యాక్షన్, డ్యాన్స్ చేయొద్దని కోరారు. దీంతో ఆ విషయాన్ని బాలీవుడ్ గ్రీకు వీరుడు సవాల్‌గా తీసుకున్నాడు. పిట్‌నెస్‌పై దృష్టి సారించడం మొదలుపెట్టాడు. అనంతరం యాక్షన్, డ్యాన్స్ ఉన్న సినిమాలతోనే ఫేమ్ సంపాదించుకున్నాడు. గతాన్ని గుర్తు చేసుకుంటే హృతిక్‌కు అద్భుతంగా అనిపిస్తుందట. ఇప్పటికి కూడా సినిమాల్లో నటిస్తున్నందుకు సంతోషంగా ఉందని హృతిక్ చెప్పాడు. ‘విక్రమ్ వేద’ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఆల్కోహోలియా’ పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ లో హృతిక్ స్టెప్పులతో అదరగొట్టాడు. ‘విక్రమ్ వేద’ ను రూ. 170కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నారు. ఇక హృతిక్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం అతడి చేతిలో అనేక ప్రాజెక్టులున్నాయి. యాక్షన్ చిత్రం ‘ఫైటర్’ ను త్వరలోనే పట్టాలెక్కించనున్నాడు. రామాయాణ్ వెబ్‌సి‌రీస్‌లోను ఓ కీలక పాత్ర పోషించనున్నాడని వదంతులు హల్‌చల్ చేస్తున్నాయి.  



Updated Date - 2022-09-18T01:34:34+05:30 IST