Hrithik Roshan: ‘బ్రహ్మాస్త్ర’ మేకర్స్‌కు షాక్..!

ABN , First Publish Date - 2022-09-03T20:29:22+05:30 IST

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ (Karan Johar) నిర్మించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ’ (Brahmastra Part One: Shiva). స్టార్ కపుల్ ఆలియా భట్ (Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ (Ranbir

Hrithik Roshan: ‘బ్రహ్మాస్త్ర’ మేకర్స్‌కు షాక్..!

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ (Karan Johar) నిర్మించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ’ (Brahmastra Part One: Shiva). స్టార్ కపుల్ ఆలియా భట్ (Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరో, హీరోయిన్‌లుగా నటించారు. అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించాడు. ఫాక్స్‌‌స్టార్ స్టూడియోస్‌తో కలసి ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ సినిమా పాన్ ఇండియాగా పలు భాషల్లో రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 9న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త బీ టౌన్‌లో చక్కర్లు కొడుతుంది. ‘బ్రహ్మాస్త్ర’ మేకర్స్‌కు హృతిక్ రోషన్ రిలీజ్‌కు ముందే షాకిచ్చాడని ఓ వార్త హల్‌చల్ చేస్తుంది. 


‘బ్రహ్మాస్త్ర’ లో ఓ పాత్రను చేయాలని మేకర్స్ హృతిక్ రోషన్‌(Hrithik Roshan)ను సంప్రదించారు. అదే విధంగా ‘బ్రహ్మాస్త్ర-2 లో దేవ్ పాత్రను పోషించాలని కోరారు. కానీ, ఈ రోల్స్‌‌ను చేసేందుకు హృతిక్ రోషన్ మాత్రం నిరాకరించాడట. హృతిక్ చేతిలో ప్రస్తుతం ‘క్రిష్-4’, ‘రామాయణ’ ప్రాజెక్టులున్నాయి. ఈ చిత్రాల కోసం చాలా సమయాన్ని వెచ్చించాల్సి ఉంది. ‘బ్రహ్మాస్త్ర-2’ లో దేవ్ పాత్ర కోసం కూడా భారీగా సమయన్ని కేటాయించాలి. అందువల్ల కాల్షీట్స్‌ను కేటాయించలేక ఈ పాత్రను హృతిక్ నిరాకరించాడని తెలుస్తోంది. దీంతో మేకర్స్ దేవ్ పాత్ర కోసం మరొకరిని వెతికే పనిలో పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ‘బ్రహ్మాస్త్ర’ అత్యధిక స్క్రీన్స్‌లో విడుదల కానుంది. ఇండియాలో 5000 స్క్రీన్స్, ఓవర్సీస్‌లో 3000 స్క్రీన్స్‌ల్లో చిత్రాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ సినిమాను దక్షిణాది భాషల్లో యస్‌యస్. రాజమౌళి సమర్పిస్తున్నాడు. పురాణాల్లోని అస్త్రాలను ఆధారంగా చేసుకుని ఈ మూవీని రూపొందిచారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, మౌనిరాయ్, అక్కినేని నాగార్జున తదితరులు కీలక పాత్రలు పోషించారు.  

Updated Date - 2022-09-03T20:29:22+05:30 IST