క్యాన్సర్‌ను ఏవిధంగా జయించవచ్చో పదేపదే చెప్పండి

ABN , First Publish Date - 2021-11-08T22:25:45+05:30 IST

మణిరత్నం దర్శకత్వం వహించిన బొంబాయి సినిమాలో నటించి అభిమానుల గుండెలను కొల్లగొట్టిన నటి మనీషా కోయిరాలా. నేపాలీ నటిగా చిత్రసీమలో అడుగుపెట్టినప్పటికీ

క్యాన్సర్‌ను ఏవిధంగా జయించవచ్చో పదేపదే చెప్పండి

మణిరత్నం దర్శకత్వం వహించిన బొంబాయి సినిమాలో నటించి అభిమానుల గుండెలను కొల్లగొట్టిన నటి మనీషా కోయిరాలా. నేపాలీ నటిగా చిత్రసీమలో అడుగుపెట్టినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారమో. నేషనల్ క్యాన్సర్ అవేర్‌నేస్‌డే సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. తన అనుభవాలన్నింటిని అభిమానులందరితో పంచుకుంది. క్యాన్సర్‌పై అందరికీ అవగాహన కల్పించాల్పిందిగా ఆమె కోరింది.  


‘‘ క్యాన్సర్‌తో పోరాటం ఎంతో కష్టమో నాకు తెలుసు. కానీ, దానిని జయించే శక్తి మీలోనే ఉంది. క్యాన్సర్‌ను పోరాడి గెలిచిన వారందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ వ్యాధిపై అందరికీ అవగాహన కల్పించండి. వీలైనంత మేరకు ప్రచారం చేయండి. దీనిని ఏ విధంగా జయించవచ్చో పదేపదే చెప్పండి. వారిలో ఆశను కల్పించండి. ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం నేను ప్రార్థిస్తున్నాను ’’ అని ఆమె చెప్పింది.  


మనీషా కోయిరాలా ఓవరియన్ క్యాన్సర్‌తో పోరాడి విజయం సాధించింది. అమెరికాలోని అంకాలజిస్టుల ఆధ్వర్యంలో ఆమె చికిత్స తీసుకుంది. సినిమాల నుంచి విరామం తీసుకున్నప్పటికీ తిరిగి ఆమె అనంతరం వెండి తెర మీదకు రంగ ప్రవేశం చేసింది. లస్ట్ స్టోరీస్‌ అనే వెబ్ సిరీస్‌లో మస్కా అనే పాత్రలో ఆమె అభిమానులకు కనిపించింది.  సంజయ్ దత్, రాకేష్ రోషన్, సొనాలీ బింద్రే తదితరులందరూ క్యాన్సర్‌తో పోరాడి విజయం సాధించారు.



Updated Date - 2021-11-08T22:25:45+05:30 IST