Bollywood Music: బాలీవుడ్ మ్యూజిక్‌ను మార్చేస్తున్న ఇన్‌స్టాగ్రామ్

ABN , First Publish Date - 2022-07-21T01:59:46+05:30 IST

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నిర్మించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1:శివ’ (Brahmāstra Part One: Shiva). అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలోని ‘కేసరియా’ సాంగ్ టీజర్ ఘనవిజయం

Bollywood Music: బాలీవుడ్ మ్యూజిక్‌ను మార్చేస్తున్న ఇన్‌స్టాగ్రామ్

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నిర్మించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1:శివ’ (Brahmāstra Part One: Shiva). అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలోని ‘కేసరియా’ సాంగ్ టీజర్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ పాట లిరిక్స్ క్యాచీ, రిథమిక్, మెలోడియస్‌గా ఉంటాయి. ఈ పాట  30సెకండ్ల టీజర్‌ను మేకర్స్ ఏప్రిల్ 13న విడుదల చేశారు. టీజర్ విడుదల కాగానే సోషల్ మీడియాలో ట్రెండ్ కావడం మొదలైంది. అందరు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం మొదలుపెట్టారు. అధికారికంగా 5,30,00 రీల్స్ ఇన్‌స్టాలో అప్‌లోడ్ అయ్యాయి. ఈ సాంగ్ టీజర్‌ను క్రాప్ చేయకుండానే అందరు రీల్స్ చేశారు. ఆ పాట అందులో అద్భుతంగా ఇమడంతో అందరు పూర్తి పాట కోసం ఎదురు చూడసాగారు.  


‘కేసరియా’ ఫుల్ సాంగ్ జులై 17న విడుదలైంది. ఈ పాట విడుదల కాగానే ప్రేక్షకులు రెండుగా విడిపోయారు. సాంగ్ మొత్తంలో మొదట్లో విడుదల చేసిన 30సెకండ్లు మాత్రమే బాగుందని అభిప్రాయపడ్డారు. మేకర్స్ చాలా పరిశీలన చేసిన తర్వాత క్యాచీ లిరిక్స్‌ను విడుదల చేస్తారు. అందుకు ముఖ్య కారణం ఏంటంటే.. టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా సినిమాకు ప్రచారం వస్తుంది. మొదట్లో విడుదల చేసిన లిరిక్స్ బాగుంటే పూర్తి పాట కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తారు. పాట మీద ఆసక్తి ఉండటంతో ఫాలోయర్స్, ఆర్టిస్స్, నిర్మాతలు, మ్యూజిక్ లేబుల్స్ లాభాన్ని సంపాదించుకుంటాయి. సినిమాకు పూర్తి పాట ద్వారా వచ్చే ప్రచారం కంటే 30సెకండ్ల టీజర్ ద్వారా అధికంగా ప్రచారం లభిస్తుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘‘క్యాచీ లిరిక్స్‌ను విన్న తర్వాత పూర్తి పాట గురించి ఎవరు పట్టించుకుంటారు. శ్రోతలు పూర్తి అల్బమ్‌ను వినే రోజులు పోయాయి’’ అని సౌండ్ డిజైన్‌కు ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్న రోహిత్ ప్రధాన్ చెప్పాడు. 


ప్రస్తుతం భారత్‌లో మ్యూజిక్ అనేది షార్ట్ వీడియోస్‌గా మారుతుందని కొంత మంది మ్యూజిషియన్స్ పేర్కొంటున్నారు. ‘‘ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసమే మ్యూజిక్‌ను రూపొందిస్తున్నారు. అది నిజంగా విచారకరం. రీల్స్ కోసమే మ్యూజిక్‌ను క్రియేట్ చేస్తే అది ప్లాఫ్ అవుతుంది. ఒకవేళ విజయం సాధించిన కూడా కొంత కాలమే ఉంటుంది. సంగీతం అనేది కళ. రీల్స్ ద్వారా సంచలనంగా మిగిలిపోకూడదు’’అని సలీమ్ మర్చంట్ చెప్పాడు. కొంత మంది రీల్స్ కోసమే మ్యూజిక్‌ను క్రియేట్ చేస్తున్నారని కంటెంట్ క్రియేటర్ అవంతి నాగ్రాల్ చెప్పింది. ‘‘ప్లాట్‌ఫాంస్‌లో కొన్ని పాత పాటలు వైరల్‌గా మారటం మనం చూస్తుంటం. ఎందుకంటే అవి మంచి సాంగ్స్. మార్కెటింగ్‌ను దృష్టిలో ఉంచుకోవడం, రీల్స్ కోసం పాటను సృష్టించడం మధ్య ఒక సన్నని గీత ఉంది’’ అని ఆమె చెప్పింది.  


రీల్స్ కోసమే పాటను రూపొందించినప్పటికీ అందుకు టైమింగ్ కూడా ముఖ్యమే అని శివాన్ష్ జిందాల్ పేర్కొన్నాడు. ‘‘ప్రజలు మంచి పాటల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. సాంట్ టీజర్ బాగుంటే దానిని హిట్ చేస్తారు. పూర్తి పాట కోసం ఎదురు చూడటం మనేస్తారు. క్యాచీ లిరిక్స్ 30 సెకండ్ల‌లోనే వస్తే మేకర్స్ దానిని విడుదల చేస్తారు. మార్కెటింగ్ కోసం ఉపయోగించుకుంటారు. ప్రస్తుతం సినిమాల్లో ఐదు నిమిషాల నుంచి ఆరు నిమిషాల పాటలు ఉంటున్నాయి. ప్రస్తుతం రీల్స్ 30 సెకండ్ల నుంచి 60సెకండ్లకు అక్కడి నుంచి 90సెకండ్లకు విస్తరించాయి. ఇటువంటి అభిరుచులు శాశ్వతంగా ఉండవు. అందరు తిరిగి పూర్తి పాటను వినడానికి ఇష్టపడతారు’’ అని అతడు పేర్కొన్నాడు.   


సంగీత ప్రపంచంలో రీల్స్ అనేవి కొత్త ట్రెండ్ అని ‘లూడో’, ‘రేస్-3’ సినిమాలకు లిరిక్స్ అందించిన శ్లోక్ లాల్ తెలిపాడు. ‘‘నుస్రత్ ఫతే అలీ ఖాన్ గజల్స్ వింటే 8నిమిషాల నుంచి 10నిమిషాల పాటు ఉండేవి. రెండు నిమిషాల అనంతరమే మొదటి లైన్ వినిపిస్తుంది. ప్రస్తుతం సినిమాల్లో 3నిమిషాల సాంగ్స్ వస్తున్నాయి. ఆ పాటలను మరింత తక్కువగా నిమిషానికి కుదించాం. ఒక్క క్రియేటర్‌గా మన పనిని ఎక్కువ మంది చూడాలనుకుంటాం. మ్యూజిక్ అనేది డిమాండ్, సప్లయ్ ఆధారంగా నడుస్తుంది. ప్రేక్షకులు ఎటువంటి పాటలను డిమాండ్ చేస్తే అటువంటి వాటిని సప్లయ్ చేయాలి’’ అని శ్లోక్ లాల్ చెప్పాడు.


మ్యూజిక్ బిజినెస్‌లో భాగంగా ఈ మార్పులు వస్తున్నాయని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రమోషన్స్ కోసం కొన్ని పాటలను ఆ విధంగా క్రియేట్ చేస్తున్నారు. సినిమాలను ప్రేక్షకులకు చేరువ చేసేందుకు ఈ క్యాచీ లైన్స్‌ను రాస్తున్నారు. అనంతరం ఈ పాటలు వైరల్‌గా మారుతున్నాయి. ‘‘నిజం చెప్పాలంటే బాలీవుడ్‌లో వైరల్ అంటే లాభం అని అర్థం. నిర్మాతలు సినిమాలపై కొన్ని కోట్లు ఖర్చు చేస్తారు. సాంగ్ హిట్ అయితే ఆ చిత్రంపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతుంది. అందువల్లే చిత్ర నిర్మాతలు సోషల్ మీడియాలో ప్రభావం చూపించే వ్యక్తులతో కలసి పని చేస్తున్నారు.


ధనుష్, సారా అలీఖాన్ నటించిన సినిమా ‘అత్రాంగీ రే’ (Atrangi Re). ఈ చిత్రంలోని ‘చకా చక్’ పాట భారీ విజయం సాధించింది. దీంతో సినిమా ప్రమోషన్ అంతా ఈ సాంగ్ చుట్టే తిరిగింది. ఈ పాటకు రీల్ చేసి సోషల్ మీడియాలో సారా పోస్ట్ చేసింది. ఆమెను అనుకరిస్తూ అనేక మంది ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. సోషల్ మీడియాలో దాదాపుగా 3లక్షలకుపైగా రీల్స్ అప్‌లోడ్ అయ్యాయి. ప్రస్తుతం బాలీవుడ్ మ్యూజిక్‌లో రీల్స్ అనే ట్రెండ్ నడుస్తుంది. సంగీత ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తుంది. రాబోయే కాలంలో మ్యూజిక్ ఇండస్ట్రీలో ఇంకెన్ని మార్పులు వస్తాయో తెలియాలంటే ా  కాలమే సమాధానం చెప్పాలి. 

Updated Date - 2022-07-21T01:59:46+05:30 IST