ఐశ్వర్యతో పెళ్లిపై.. అభిషేక్ బచ్చన్ సమాధానం..

ABN , First Publish Date - 2022-04-20T22:27:27+05:30 IST

బాలీవుడ్ సెలబ్రిటీస్ ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ప్రేమించి, పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం 2007, ఏప్రిల్ 20న అత్యంత వైభవంగా జరిగింది.

ఐశ్వర్యతో పెళ్లిపై.. అభిషేక్ బచ్చన్ సమాధానం..

బాలీవుడ్ సెలబ్రిటీస్ ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ప్రేమించి, పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం 2007, ఏప్రిల్ 20న అత్యంత వైభవంగా జరిగింది. ఈ జంటకు పెళ్లయి నేటితో పదిహేనేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఓ సారి గతాన్ని గుర్తు చేసుకుందాం.


పెళ్లయిన కొత్తలో సెలబ్రిటీ దంపతులు ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ఓఫ్రా విన్ ఫ్రే టీవీ షోలో పాల్గొన్నారు. ఈ షోలో అనేక ఆసక్తికర కబుర్లను అభిమానులకు అభిషేక్ తెలిపాడు. ఐశ్వర్యకు ఏలా ప్రపోజ్ చేసింది, ఇద్దరు కలసి ఏవిధంగా సమయాన్ని గడిపింది..తదితర విషయాలను వివరించాడు. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ ఓఫ్రా..‘‘ప్రపంచంలోనే అత్యంత అందమైన యువతిని పెళ్లి చేసుకున్నారు. మీకు ఏలా అనిపిస్తుంది’’ అని అభిషేక్‌ను అడిగింది. ఆ ప్రశ్నకు కొంచెం కూడా తడుముకోకుండా.. ‘‘చాలా సంతోషకరంగా ఉంది’’ అని అతడు సమాధానమిచ్చాడు. అంతటితో ఆగకుండా..‘‘ఆమె అందమైనది. చాలా మంచిది. ఉదయం లేచినప్పుడు ఏవిధంగా ఉంటుందో రోజంతా అలాగే కనిపిస్తుంది’’ అని అభిషేక్ తెలిపాడు. అతడు చెప్పిన సమాధానంతో ఇంటర్వ్యూలో పక్కనే కూర్చున్న ఐశ్వర్య పగలబడి నవ్వింది. తాను అభిషేక్‌ను ఎందుకు పెళ్లి  చేసుకుందో చెప్పింది. ‘‘అతడు ప్రతి విషయాన్ని ఫన్నీగా చూస్తాడు’’ అంటూ అభిషేక్‌ను పొగిడింది. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్‌లకు ఆరాధ్య బచ్చన్ అనే కూతురు ఉంది. ఈ దంపతులు హీరో, హీరోయిన్లుగా ‘గురు’, ‘ఉమ్రావ్ జాన్’, ‘ధూమ్ 2’, ‘రావణ్’ వంటి సినిమాల్లో నటించారు.

Updated Date - 2022-04-20T22:27:27+05:30 IST