చెంపదెబ్బ కొట్టిన విల్‌‌స్మిత్ .. ఆస్కార్ అవార్డ్‌ల సభ్యత్వానికి రాజీనామా..

ABN , First Publish Date - 2022-04-02T20:48:52+05:30 IST

హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌

చెంపదెబ్బ కొట్టిన విల్‌‌స్మిత్ .. ఆస్కార్ అవార్డ్‌ల సభ్యత్వానికి రాజీనామా..

హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్  అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ (అకాడమీ అవార్డ్స్‌)కు రాజీనామా చేశాడు. క్రిస్‌ను చెంపదెబ్బ కొట్టడం బాధాకారమైనదిగా పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఓ ప్రకటనను విడుదల చేశాడు.


‘‘94వ ఆస్కార్ వేడుకల ప్రదానోత్సవంలో నా ప్రవర్తన క్షమించరానిది. బాధాకరమైంది. అందరినీ షాక్‌కు గురి చేసింది. క్రిస్ రాక్, అతడి కుటుంబ సభ్యులు, నా సన్నిహితులతో సహ చాలామంది నా వల్ల బాధపడ్డారు. నేను అకాడమీ నమ్మకాన్ని వమ్ము చేశాను. ఈ వేదికపై నాతో సహా ఇతర నామినీలు, విన్నర్స్ సంతోషంగా వేడుక చేసుకునే అవకాశాన్ని కోల్పోయేలా చేశాను. నేను చాలా ఆవేదనలో ఉన్నాను. ఆస్కార్ అవార్డ్‌ల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. బోర్డు తీసుకునే ఎటువంటి చర్యలనైనా నేను అంగీకరిస్తాను’’ అని విల్ స్మిత్ తెలిపాడు. 


రాజీనామాను ఆమోదించిన బోర్డు:

విల్ స్మిత్ రాజీనామాను ఆమోదించనట్టు అకాడమీ అవార్డ్స్ ప్రెసిడెంట్ డేవిడ్ రూబిన్ తెలిపాడు. క్రమశిక్షణా చర్యలో భాగంగా అతడిపై ఆంక్షలు కొనసాగిస్తామన్నాడు. ఏప్రిల్ 18న జరిగే బోర్డు సమావేశంలో ఈ విషయంపై చర్చిస్తామన్నాడు 


విల్ స్మిత్ చెంపదెబ్బ వ్యవహారం:

ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డుని ప్రకటించడానికి ముందు ప్రముఖ కమెడియన్, షో హోస్ట్ క్రిస్ రాక్ స్టేజ్ పైకి వచ్చాడు. విల్‌స్మిత్‌ భార్య జాడా పింకెట్ ప్రస్తావనను తీసుకొచ్చాడు. ‘జీ.ఐ.జెన్’ చిత్రంలో ‘డెమి‌మూర్’ పోషించిన పాత్రలో జాడాను పోల్చాడు. దీంతో భరించలేకపోయిన విల్ స్మిత్ ఆగ్రహానికి గురయ్యాడు. స్టేజ్ పైకి వెళ్లి క్రిస్ చెంప పగలకొట్టాడు. జాడా పింకెట్‌ ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవానికీ పూర్తిగా గుండుతో హాజరయింది. ఆమెకు ‘అలోపెసియా’ అనే సమస్య ఉంది. ఈ సమస్య ఉన్నవారికి జుట్టు పూర్తిగా ఊడిపోతుంటుంది. 

 




Updated Date - 2022-04-02T20:48:52+05:30 IST