ట్విట్టర్ ని స్వంతం చేసుకున్న మస్క్... Priyanka ‘బావగారి’ రియాక్షన్ ఏంటంటే....

ABN , First Publish Date - 2022-04-26T23:38:31+05:30 IST

ప్రపంచపు అత్యంత సంపన్నుడు ఎలెన్ మస్క్ ట్విట్టర్ స్వంతం చేసుకున్నాడు. ఇండియాలో దీని గురించి మరీ పెద్దగా చర్చ జరగటం లేదు. ఎవరో కొందరు మాత్రమే ట్విట్టర్ చర్చ కొనసాగిస్తున్నారు. కానీ, అమెరికాలో సీన్ మరోలా ఉంది. ట్విట్టర్ మొత్తానికి మొత్తంగా మస్క్ ఒక్కడి చేతిలోకి వెళ్లిపోవటం చాలా మందిని ఆందోళనకు గురి చేస్తోంది. ఇకపై ట్విట్టర్... ఎలెన్ మస్క్ ఆధీనంలోని ఒకానొక ప్రైవేట్ కంపెనీగా కొనసాగబోతోంది!

ట్విట్టర్ ని స్వంతం చేసుకున్న మస్క్... Priyanka ‘బావగారి’ రియాక్షన్ ఏంటంటే....

ప్రపంచపు అత్యంత సంపన్నుడు  ఎలెన్ మస్క్ ట్విట్టర్ స్వంతం చేసుకున్నాడు. ఇండియాలో దీని గురించి మరీ పెద్దగా చర్చ జరగటం లేదు. ఎవరో కొందరు మాత్రమే ట్విట్టర్ చర్చ కొనసాగిస్తున్నారు. కానీ, అమెరికాలో సీన్ మరోలా ఉంది. ట్విట్టర్ మొత్తానికి మొత్తంగా మస్క్ ఒక్కడి చేతిలోకి వెళ్లిపోవటం చాలా మందిని ఆందోళనకు గురి చేస్తోంది. ఇకపై ట్విట్టర్... ఎలెన్ మస్క్ ఆధీనంలోని ఒకానొక ప్రైవేట్ కంపెనీగా కొనసాగబోతోంది!

మస్క్ ట్విట్టర్ టేక్ ఓవర్ పై దాదాపుగా హాలీవుడ్ అంతా వ్యతిరేకంగానే స్పందించింది. ఎవరొ కొందరు తప్ప చాలా మంది సొషల్ మీడియా జెయింట్ ఫ్యూచర్ పై ఆందోళన వ్యక్తం చేశారు. యాక్టర్ - డైరెక్టర్, స్టార్ వార్స్ ఫేమ్ రాబ్ రెయినర్ ఘాటుగానే స్పందించాడు. మస్క్ ఇప్పుడు తప్పుడు మాటలు మాట్లాడే ట్రంప్ ను తిరిగి తీసుకొస్తాడా అంటూ ప్రశ్నించాడు. అమెరికా మాజీ అధ్యక్షుడి పేరు నేరుగా రాయకున్నా పరోక్షంగా ఆయన్ని ఉద్దేశించి తన ట్వీట్ లో ప్రస్తావించాడు. ట్రంప్ లాంటి అబద్ధాలకోరుని మస్క్ తిరిగి ట్విట్టర్ లోకి తెస్తే ఎలా అంటూ రాబ్ ప్రశ్నించాడు. మనం ఏం చేయాలో కూడా ఆలోచించాలని ఆయన అన్నాడు. 

మార్వెల్ స్టూడియోస్ వారి మూవీస్ లో కనిపించే హాలీవుడ్ స్టార్ హీరో సిము ల్యూ 44 బిలియన్ డాలర్లు వృథా అయ్యాయని వాపోయాడు. ఎలెన్ మస్క్ కు 44 బిలియన్ డాలర్ల భారీ వ్యయంతో... ఇంతకంటే మంచి పనే దొరకలేదా... చేయటానికి... అంటూ విమర్శించాడు. అయితే, ‘ఐస్ క్యూబ్’ లాంటి ఫేమస్ అమెరికన్ సింగర్ మాత్రం మస్క్ చేసిన పనిని సమర్థించాడు. ‘‘ఫ్రీ ఎట్ లాస్ట్’’ అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. 

కొందరు సమర్థించటం, కొందరు విమర్శించటం... ఇదంతా ఎప్పుడూ ఉండేదే. కానీ, ప్రియాంక చోప్రా ‘బావ’ మాత్రం భిన్నంగా ట్వీట్ చేశాడు. నిక్ జోనాస్ అన్న కెవిన్ జోనాస్ ‘‘మనకు ఇప్పుడు ఎడిట్ ట్వీట్ ఆప్షన్ లభిస్తుందా?’’ అని కామెంట్ చేశాడు! సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్ అయిన కెవిన్ గతంలో మస్క్ డిస్కస్ చేసిన ‘ఎడిట్ ట్వీట్’ ఆప్షన్ గురించి నెటిజన్స్ కు గుర్తు చేశాడు. ట్విట్టర్ తన యూజర్స్ కు ట్వీట్ ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించాలని ఇంతకు ముందు ఆయన అన్నాడు. ఇప్పుడు ట్విట్టర్ నూటికి నూరు శాతం మస్క్ వశమైంది కాబట్టి తాను అన్నంత పని చేస్తాడా అన్నదే... ప్రియాంక ‘బావగారి’ ఆలోచన! చూడాలి మరి... ట్విట్టర్ వ్యవహారంపై మన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక స్వయంగా తానేమంటుందో... అలాగే, మస్క్ ని సమర్థించే వారు, వ్యతిరేకించే వారు కూడా ఆయన ఆధీనంలోకి వెళ్లిపోయిన ట్విట్టర్ లోనే తమ తమ అభిప్రాయాలు చెబుతుండటం, ఇక్కడ అసలైన కొసమెరుపు! 

Updated Date - 2022-04-26T23:38:31+05:30 IST