ప్రపంచంలో అందమైన వ్యక్తులెవరో తెలుసా..? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుందా. పురాతన ఫేసింగ్ పద్ధతిని ఉపయోగించి చేసిన ఓ పరిశోధనలో హాలీవుడ్ నటులు అంబర్డ్ హర్డ్ (Amber Heard), రాబర్ట్ పాటిన్సన్(Robert Pattinson) అందమైన వ్యక్తులు అని వెల్లడైంది.
లండన్‌లోని సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ ఫేషియల్ కాస్మొటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ సంస్థకు చెందిన జూలియన్ డి సిల్వ(Julian De Silva)ఈ పరిశోధన చేశారు. పురాతన ఫేషియల్ మ్యాపింగ్ టెక్నిక్ ‘పీహెచ్‌ఐ’(పీహెచ్‌ఐ అనేది గ్రీస్‌కు చెందిన ఫేస్ మ్యాపింగ్ టెక్నిక్. మన ముఖం ఎంత అందంగా ఉందని గ్రీకుకు చెందిన గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ 1.618తో లెక్కిస్తారు) ను ఆధారంగా చేసుకుని ‘మోస్డ్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ వరల్డ్’ అంబర్ హర్డ్, ‘మోస్ట్ హ్యాండ్సమ్మెన్ ఇన్ ద వరల్డ్’ రాబర్ట్ పాటిన్సన్ అని జూలియన్ చెప్పారు. ఈ పరిశోధన ప్రకారం.. అంబర్ హర్డ్ అందం 91.85శాతం, కిమ్ కర్ధాషియన్ అందం 91. 39శాతం అని తేలింది. రాబర్ట్ పాటిన్స్న్ హ్యాండ్సమ్నెస్ 92.15శాతం, హెన్రికావిల్ హ్యాండ్సమ్నెస్ 91.64శాతం అని వెల్లడెంది. ఈ న్యూస్ వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్స్ అందరు అంబర్ హర్డ్, రాబర్ట్ పాటిన్సన్కు శుభాకాంక్షలు చెప్పాడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల క్రితం అంబర్ హర్డ్ మాజీ భర్త జానీ డెప్ (Johnny Depp)తో పరువు నష్టం కేసును ఓడిపోయింది. దీంతో జానీ డెప్‌కు 10మిలియన్ డాలర్స్ చెల్లించాలని కోర్టు అంబర్‌కు ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం అంబర్ హర్డ్ డీసీ కామిక్స్‌కు చెందిన ‘ద ఆక్వామ్యాన్-2’ (The Aquaman 2)లో నటిస్తున్నారు. రాబర్ట్ పాటిన్సన్ చివరగా ‘ద బ్యాట్ మ్యాన్ ’లో కనిపించారు.