Hollywood star salaries: 800 కోట్లతో అగ్రస్థానంలో ఉన్న మిషన్ ఇంపాజిబుల్ హీరో.. అత్యల్పంగా ఆ మార్వెల్ స్టార్‌కి..

ABN , First Publish Date - 2022-07-21T17:12:35+05:30 IST

ప్రతి దేశంలోనూ హాలీవుడ్ సినిమాలకి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. అందుకే అక్కడి సినిమా పలు ప్రాంతీయ భాషల్లోకి..

Hollywood star salaries: 800 కోట్లతో అగ్రస్థానంలో ఉన్న మిషన్ ఇంపాజిబుల్ హీరో.. అత్యల్పంగా ఆ మార్వెల్ స్టార్‌కి..

ప్రతి దేశంలోనూ హాలీవుడ్ సినిమాలకి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. అందుకే అక్కడి సినిమా పలు ప్రాంతీయ భాషల్లోకి డబ్బింగ్ అయ్యి కోట్ల కలెక్షన్లను కొల్లగొడుతూ ఉంటాయి. అందుకే ఈ సినిమాల్లో నటించిన స్టార్స్ కోట్లలో రెమ్యూనరేషన్లు తీసుకుంటూ ఉంటారు. తాజాగా ఈ మూవీస్ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న స్టార్స్ వీళ్లేనంటూ వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. అందులో.. మిషన్ ఇంపాజిబుల్ సినిమాలతో పాపులారిటీ సాధించిన టామ్ క్రూజ్ అగ్రస్థానంలో ఉన్నాడు.


నిజానికి టామ్ క్రూజ్ త్వరలో మరో రెండు మిషన్ ఇంపాజిబుల్ సినిమాలు చేయనున్నాడు. వాటికోసం చాలా తక్కువ పారితోషికాన్ని అందుకోనున్నాడు. కానీ.. లాభాల్లో వాటా మాత్రం తీసుకుంటాడు. ఈ స్టార్ హీరో నటించిన తాజా చిత్రం ‘టాప్ గన్: మావేరిక్’ ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ఇప్పటి వరకు 1.2 బిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీలో దాదాపు రూ.9600 కోట్లు) వసూళ్లు సాధించింది. ఈ మూవీకి సైతం తక్కువ పారితోషికాన్ని అందుకున్నాడు టామ్. కానీ లాభాల్లో వాటాగా 100 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 800 కోట్లు) అందుకోనున్నట్లు తెలుస్తోంది.


టామ్ తర్వాత 35 మిలియన్ డాలర్లతో విల్ స్మిత్ రెండో స్థానంలో ఉన్నాడు. 30 మిలియన్ డాలర్లతో లియోనార్డో డికాప్రియో, బ్రాడ్‌పిట్.. 30 మిలియన్ డాలర్లతో డ్వేన్ జాన్సన్, విల్ ఫెర్రెల్, క్రిస్ హెమ్స్‌వర్త్, విన్ డీజిల్, టామ్ హార్డీ (వరుసగా బ్లాక్ ఆడమ్, స్పిరిటెడ్, ఎక్స్‌ట్రాక్షన్ 2, ఫాస్ట్ X మరియు వెనం 3 కోసం) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 


జోకర్ 2 మూవీకి జోక్విన్ ఫోనిక్స్ 20 మిలియన్లు డాలర్లు.. ఆక్వామాన్ సీక్వెల్ కోసం జాసన్ మోమోవా 15 మిలియన్లు డాలర్లు అందుకోనున్నారు. కాగా.. ఈ జాబితాలో దిగువన మార్వెల్ సినిమాలతో ఐరన్ మ్యాన్‌గా పాపులారిటీ సాధించిన రాబర్ట్ డౌనీ జూనియర్ ఉండడం గమనార్హం. క్రిస్టోఫర్ నూలన్ దర్శకత్వంలో వస్తున్న ‘ఓపెన్‌హైమర్’ కోసం 4 మిలియన్ డాలర్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ మూవీ డౌనీ చాలా చిన్నపాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

Updated Date - 2022-07-21T17:12:35+05:30 IST