Ranveer Singh ‘జయేశ్‌భాయ్ జోర్దార్’పై కేసు.. పూర్తి సినిమా చూపించమంటూ..

ABN , First Publish Date - 2022-05-10T15:46:15+05:30 IST

బాలీవుడ్ యువ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ తాజాగా నటించిన చిత్రం ‘జయేశ్‌భాయ్ జోర్దార్ (Jayeshbhai Jordaar)’. దివ్యాంగ్ ఠక్కర్ దర్శకత్వం వహించిన..

Ranveer Singh ‘జయేశ్‌భాయ్ జోర్దార్’పై కేసు.. పూర్తి సినిమా చూపించమంటూ..

బాలీవుడ్ యువ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ తాజాగా నటించిన చిత్రం ‘జయేశ్‌భాయ్ జోర్దార్ (Jayeshbhai Jordaar)’. దివ్యాంగ్ ఠక్కర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ భ్రూణ హత్యల నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్‌ని అందుకుంది. అయితే మే 4న ఈ మూవీ ట్రైలర్‌లో ప్రినేటల్ లింగ నిర్ధారణ కోసం అల్ట్రాసౌండ్ టెక్నాలజీని ఉపయోగించిందనే ‘యూత్ ఎగైనెస్ట్ క్రైమ్’ అనే ఎన్జీవో కేసు ఫైల్ చేసింది. మే 9న ఈ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. అనంతరం పూర్తి చిత్రాన్ని సమర్పించాలని కోర్టు మేకర్స్‌ను ఆదేశించింది. దీంతో పాటు తదుపరి విచారణను మే 10వ తేదీకి వాయిదా వేసింది.


నివేదికల ప్రకారం.. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి విపిన్ సంఘీ, జస్టిస్ నవీన్ చావ్లాలతో కూడిన ధర్మాసనం పిల్‌ని విచారించింది. ఈ చిత్రం భ్రూణహత్యల ఇతివృత్తంగా ఉన్నప్పటికీ ‘ఆడబిడ్డను రక్షించండి’ అనే అంశాన్ని నొక్కి చెబుతుందని న్యాయవాది పవన్ ప్రకాశ్ పాఠక్ దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. కానీ..  ఈ చిత్ర ట్రైలర్ అల్ట్రాసౌండ్ టెక్నాలజీని ఉపయోగించినట్లు ప్రచారం చేస్తున్నట్లు ఉంది.


NGO వేసిన పిటిషన్‌లో.. ‘సినిమా ట్రైలర్‌లోని అల్ట్రాసౌండ్ క్లినిక్ దృశ్యం, సెన్సార్‌షిప్ లేకుండా లింగ నిర్ధారణ కోసం అల్ట్రాసౌండ్ సాంకేతికత బహిరంగంగా ప్రచారం చేస్తోంది. ఐపీసీ సెక్షన్‌లు 3, 3A, 3B, 4, 6, 22 ప్రకారం.. అల్ట్రాసౌండ్ మెషీన్‌లు, ల్యాబ్‌లు, క్లినిక్‌లు మొదలైన వాటి ద్వారా ప్రినేటల్ లింగ నిర్ధారణ చేయడం చట్టవిరుద్ధం. కాబట్టి ఆ దృశ్యాన్ని వెంటనే తొలగించాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు. ఈ మూవీ మే 13న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే ఈ కేసు కారణంగా వాయిదా పడే అవకాశం ఉంటుందా అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అయితే.. ఈ విషయమై చిత్ర దర్శకుడు దివ్యాంగ్ ఠక్కర్‌, ప్రొడ్యూసర్స్‌ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

Updated Date - 2022-05-10T15:46:15+05:30 IST