‘ఝుండ్’ సినిమాపై పిటిషన్ వేసిన ఫిల్మ్ మేకర్.. జరిమానా విధించిన హై‌కోర్టు..

ABN , First Publish Date - 2022-03-06T01:25:52+05:30 IST

హైదరాబాద్ ఫిల్మ్ మేకర్‌ నంది చిన్ని కుమార్‌కు తెలంగాణ హైకోర్టు

‘ఝుండ్’ సినిమాపై పిటిషన్ వేసిన ఫిల్మ్ మేకర్.. జరిమానా విధించిన హై‌కోర్టు..

హైదరాబాద్ ఫిల్మ్ మేకర్‌ నంది చిన్ని కుమార్‌కు తెలంగాణ హైకోర్టు రూ. 10లక్షలు జరిమానా విధించింది. అమితాబ్ బచ్చన్ హీరోగా తెరకెక్కిన ‘ఝుండ్’ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేయడంతో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఈ చర్యకు పూనుకుంది. గతంలో కుదిరిన రాజీ ఒప్పందం రద్దు చేయాలని సివిల్ కోర్టును ఆశ్రయించాక వాస్తవాలను తొక్కివెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారని ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. జరిమానాను విధిస్తూ 30రోజుల్లోగా ప్రధానమంత్రి సహాయనిధికి జమచేయాలని కోరింది. 


ఫుట్‌బాల్ ఆటగాడు విజయ్ బార్సే జీవితం ఆధారంగా ‘ఝుండ్’ను తెరకెక్కించారు. ఈ సినిమాకు నాగరాజ్ మంజులే దర్శకత్వం వహించారు. టీ సిరీస్ నిర్మించింది. గతంలోనే నంది చిన్ని కుమార్ టీ సిరీస్ వద్ద రూ. 5కోట్లు తీసుకుని రాజీ ఒప్పందం కుదుర్చుకున్నారు. మూవీ విడుదలకు ముందు మళ్లీ పిటిషన్ వేయడంతో హైకోర్టు ఆ విషయాన్ని తప్పుబట్టింది.

Updated Date - 2022-03-06T01:25:52+05:30 IST