నాకు ఎలాంటి లిమిట్స్ లేవు: ‘గని’ హీరోయిన్

ABN , First Publish Date - 2022-04-05T22:39:50+05:30 IST

‘‘నాకు ఎలాంటి లిమిట్స్ లేవు.. అలాగే ఎలాంటి కెరీర్‌ ప్లానింగ్‌ కూడా లేదు.. వచ్చిన అవకాశాలలో మంచి పాత్రలు చేసుకుంటూ వెళ్తాను’’ అని పేర్కొన్నారు ‘గని’ హీరోయిన్ సయి మంజ్రేకర్. దర్శకుడు, నటుడు, నిర్మాత, రైటర్‌ మహేష్‌ మంజ్రేకర్‌

నాకు ఎలాంటి లిమిట్స్ లేవు: ‘గని’ హీరోయిన్

‘‘నాకు ఎలాంటి లిమిట్స్ లేవు.. అలాగే ఎలాంటి కెరీర్‌ ప్లానింగ్‌ కూడా లేదు.. వచ్చిన అవకాశాలలో మంచి పాత్రలు చేసుకుంటూ వెళ్తాను’’ అని పేర్కొన్నారు ‘గని’ హీరోయిన్ సయి మంజ్రేకర్. దర్శకుడు, నటుడు, నిర్మాత, రైటర్‌ మహేష్‌ మంజ్రేకర్‌ కూతురు సయీ మంజ్రేకర్‌. ‘దబాంగ్‌3’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ప్రస్తుతం ‘గని’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ హీరోగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు బాబీ, సిద్దు ముద్ద సంయుక్తంగా నిర్మించిన ‘గని’ చిత్రం ఏప్రిల్‌ 8న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ సయీ మంజ్రేకర్ మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. 


ఆమె మాట్లాడుతూ..

‘‘టాలీవుడ్‌లో పవన్‌ కల్యాణ్, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ అంటే ఇష్టం. తెలుగు సినిమాలు కూడా బాగా చూస్తాను. రామ్‌చరణ్‌‌గారి నటించిన ‘మగధీర’ చిత్రం నాకెంతో నచ్చింది. అలాగే బన్నీగారు నటించిన ‘పుష్ప’ సినిమాకి ఫిదా అయిపోయాను. మరోవైపు పవన్‌ కళ్యాణ్‌‌గారి ఫాలోయింగ్‌ చూసి ఆశ్చర్యపోయాను. ఆయన నటించిన ‘వకీల్‌సాబ్‌’ చూశాను. తెలుగు సినిమాలు హిందీ డబ్బింగ్‌లో చూస్తాను. టాలీవుడ్‌పై నాకెంతో గౌరవం ఉంది. ‘గని’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో అల్లు అర్జున్‌‌గారిని దగ్గరగా చూడటం అనేది ఫ్యాన్‌ మూమెంట్. నిజంగా లోలోపల ఎగిరి గంతేసినంత ఆనందంగా అనిపించింది. ఆ అనుభూతిని ఎప్పటికీ మరిచిపోలేను. అలాగే ‘దబాంగ్‌ 3’ ప్రమోషన్‌ కోసం హైదరాబాద్‌కి వచ్చినప్పుడు రామ్‌చరణ్‌‌గారిని కలవడం గొప్ప ఫీలింగ్‌నిచ్చింది. ఆ సమయంలో నేను తెలుగు సినిమాలు చేస్తానని అస్సలు ఊహించ లేదు.


ప్రస్తుతం నేను అన్నిరకాల పాత్రలు చేయాలని అనుకుంటున్నాను. తెలుగు, హిందీలోనే కాదు సౌత్‌లో అన్ని భాషల్లోనూ నటించాలని ఉంది. నాకు ఎలాంటి లిమిట్స్ లేవు.. అదే సమయంలో ఎలాంటి కెరీర్‌ ప్లానింగ్‌ కూడా లేదు. నా వరకు వచ్చిన అవకాశాలలో మంచి ప్రాజెక్ట్‌లు సెలక్ట్ చేసుకుంటూ వెళ్తాను. పాత్ర డిమాండ్‌ మేరకు, కథ డిమాండ్‌ మేరకు గ్లామర్‌ షోకి కూడా సిద్ధమే. ఆలియాభట్‌ అంటే నాకెంతో ఇష్టం.. ఆమె నుంచి ఇన్‌స్పైర్‌ అవుతాను. మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌తో క‌లిసి పనిచేసినందుకు చాలా హ్యాపీ. వ‌రుణ్ ఓ మంచి కోస్టార్. ‘గని’ సినిమాపై హోప్స్‌తో ఉన్నాను. ఖచ్చితంగా ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. ఇందులో నా పాత్ర చాలా బాగుంటుంది. తెలుగు ప్రేక్షకులందరూ నన్ను చక్కగా రిసీవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా ‘మేజర్‌’లో నటిస్తున్నాను..’’ అని చెప్పుకొచ్చారు.

Updated Date - 2022-04-05T22:39:50+05:30 IST