అందుకే ఎమోషనల్ అయ్యా: సాయిపల్లవి

ABN , First Publish Date - 2021-12-21T23:59:39+05:30 IST

నాకు సినిమాపై పూర్తిగా న‌మ్మ‌కం క‌లిగాకే ఓకే చెబుతాను. అది ఏ చిత్రమైనా సరే. స్క్రిప్ట్ చదివే సంతకం పెడతాం కదా... సంతకం చేసిన తర్వాత పాత్ర పరంగా ఏమైనా పరిమితులు అంటే బావుండదు. అలాగే స్క్రిప్ట్ చదివేటప్పుడు ‘సినిమా ఇలా ఉంటుంది, నా పాత్ర అలా చేయవచ్చు’ అని ఒక‌ ఐడియా వస్తుంది. చిన్నప్పుడు మనం చరిత్ర

అందుకే ఎమోషనల్ అయ్యా: సాయిపల్లవి

న్యాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోహీరోయిన్లుగా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి చిత్ర విశేషాలను మీడియాకు తెలియజేసింది. 


ఆమె మాట్లాడుతూ.. ‘‘నాకు సినిమాపై పూర్తిగా న‌మ్మ‌కం క‌లిగాకే ఓకే చెబుతాను. అది ఏ చిత్రమైనా సరే. స్క్రిప్ట్ చదివే సంతకం పెడతాం కదా... సంతకం చేసిన తర్వాత పాత్ర పరంగా ఏమైనా పరిమితులు అంటే బావుండదు. అలాగే స్క్రిప్ట్ చదివేటప్పుడు ‘సినిమా ఇలా ఉంటుంది, నా పాత్ర అలా చేయవచ్చు’ అని ఒక‌ ఐడియా వస్తుంది. చిన్నప్పుడు మనం చరిత్ర చ‌దువుతున్న‌ప్పుడు ఈ క్యారెక్ట‌ర్ ఇలా ఉంటుందని ఊహించుకుంటాం కదా. అలాగే ‘శ్యామ్ సింగరాయ్‌’ స్క్రిప్ట్ చ‌దివేటప్పుడు దేవదాసి పాత్ర ఎలా చేయాలి అనేదాని కంటే వాళ్ల సైకాలజీ ఎలా ఉంటుంది అని చెప్ప‌డం నచ్చింది. వేరే సినిమాల‌తో పోలిస్తే ఈ సినిమా వరకు మాత్రం సైకాలజీ ప‌రంగా చేశాను. చాలా స్ట్రాంగ్ క్యారెక్ట‌ర్ అయితేనే సాయి ప‌ల్ల‌వి ఓకే చేస్తుందా? అంటే అలా ఏం లేదు.. అవ‌న్ని నేను న‌మ్మి చేశాను. ప్రేక్షకులకు కూడా న‌చ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. దేవదాసి వ్యవస్థ గురించి పాఠశాలలో చదివా. దేవదాసీలు ప్రారంభంలో దేవుడికి సేవకులుగా ఉన్నారు. తర్వాత్తర్వాత దాన్ని మార్చేశారు. వాళ్ల గురించి పూర్తిగా చూపించ‌లేదు. మా సినిమాకు ఆ పాత్రను ఎంత వరకు కావాలో అంతే తీసుకున్నాం. శ్యామ్ సింగరాయ్ పాత్రతో పాటు దేవ‌దాసి పాత్ర‌ ఎంత చూపించాలో, అంతే చూపించారు. ఇది పూర్తిగా దేవదాసి వ్యవస్థపై తీసిన సినిమా కాదు. అన్ని మూవీస్‌కి.. క్యారెక్ట‌ర్‌కు క‌నెక్ట్ అయితేనే స్క్రీన్ మీద యాక్టింగ్ బాగుంటుంది అనిపిస్తుంది. లేదంటే డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ సినిమాలో సాయి పల్లవి క‌నిపించ‌దు.. దేవదాసి పాత్రే కనపడుతుంది.


‘శ్యామ్ సింగరాయ్’ ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు కృతజ్ఞతతో వ‌చ్చాయి. అది మాత్రమే కాదు.. ఆ పాట అనురాగ్ కులకర్ణి పాడారు. డాన్స్ చేశారు. మనం ఒక కళను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నామంటే.. అందులో ఏదో దైవత్వం దాగుందనే నమ్ముతాను. మనకు ఏమీ రాకున్నా ఎంజాయ్ చేయగలుగుతాం. అదే దేవుడు ఇచ్చిన పెద్ద ఆశీర్వాదం. అవన్నీ చూసి ఎమోషనల్ అయ్యాను. నా బ్రెయిన్‌లో నేను మామూలు సాయి పల్లవినే. అయితే...నేను చేసే సినిమాలు చాలామందికి సంతోషం ఇస్తున్నాయంటే.. అది మాములు విషయం కాదు కదా!.. అందుకే ఎమోషనల్ అయ్యాను. నేను ప్రేక్షకులకి ఎంతో రుణపడి ఉన్నాను. నాతో సినిమాలు చేసిన దర్శకులు, నిర్మాతలకు... ప్రేక్షకులు అందరికీ థాంక్స్ చెప్పాలని అనుకున్నాను. అందుకే అలా ఎమోషనల్ అయ్యాను.


నేను డాన్స్ ఎక్కువ చేసింది ‘లవ్ స్టోరీ’లోనే అనుకుంటా.. ఈ సినిమాలో డాన్స్ ఎంత కావాలో... అంతే పెట్టారు. నాకు క్లాసికల్ డాన్స్ రాదు. ఇప్పటి వరకు నేర్చుకోలేదు. నేను చేయగలుగుతానని రాహుల్ నమ్మారు. నాతో పాటు పాటలో క్లాసికల్ డాన్స్ చేసిన వారు చాలా ఎక్స్‌పీరియ‌న్స్ ఉన్న‌వాళ్లు. ఆ పాటకు డాన్స్ చేసేటప్పుడు చాలా భయపడ్డాను. వాళ్లతో ఒకేలా చేశానని అంటే అదే పెద్ద సక్సెస్ అనుకున్నాను. నాకు ఎందులో ప్యాషన్ ఉందంటే.. నాకు నా గురించి తెలుసుకోవాలని ఉంటుంది. యాక్టింగ్, డాన్స్, మెడిసిన్ కాకుండా మెడిటేషన్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే... నా గురించి, పరిస్థితుల గురించి లోతుగా ఆలోచించాలని అనుకుంటున్నాను. నా గురించి నేను మ‌రింత తెలుసుకోవాలి అనుకుంటున్నాను.


‘ఎంసీఏ’ టైమ్‌లో నాకు, నానిగారికి సన్నివేశాలు తక్కువ. సినిమాలో 20-30 ప‌ర్సెంట్ మాత్ర‌మే ఉంటాయి. అందుక‌ని నేను ఎలా ఉంటానో...అందులో అలాగే ఉన్నాను. నానిగారు కూడా అంతే! డిఫ‌రెంట్‌గా ఏమీ ట్రై చేయ‌లేదు. ‘శ్యామ్ సింగరాయ్’లో మా క్యారెక్టర్స్ వేరేలా ఉన్నాయి. మా ఇద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు ఇంకా కొంచెం డీప్‌గా ఉన్నాయి. అప్పుడూ, ఇప్పుడూ సేమ్ కంఫర్ట్. ఈ క్యారెక్టర్స్ కోసం మా మధ్య ఎక్కువ డిస్కషన్స్ ఉన్నాయి. దర్శకుడు రాహుల్ చాలా క్లారిటీతో సినిమా తీశారు. ఈ క‌థ‌కి ఏం కావాలి ఏం వ‌ద్దు అనేది ఆయ‌న‌కు పూర్తిగా తెలుసు. నాని, నేను షూటింగ్ చేసిన ఫస్ట్ సీన్.. సినిమాలో మా ఇద్దరి క్యారెక్ట‌ర్స్ మ‌ధ్య లాస్ట్ సీన్. ఎలా చేయాలో మాకు తెలియలేదు. తను ఇలా చేయండి అని చెప్పారు మేం ఆయ‌న్ని ఫాలో అయ్యాం అంతే. తర్వాత నేను చేస్తున్న ‘విరాట పర్వం’ షూటింగ్ పూర్త‌యింది. నా పాత్ర డ‌బ్బింగ్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. తమిళంలో ఓ సినిమా చేశా. అది కూడా త్వరలోనే విడుదల అవుతుంది. ప్ర‌స్తుతం వెబ్ కంటెంట్ చ‌దువుతున్నా. న‌చ్చితే త‌ప్ప‌కుండా చేస్తాను..’’ అని తెలిపారు.

Updated Date - 2021-12-21T23:59:39+05:30 IST