నేను ప్రెగ్నెంట్ అని చెప్పింది అందుకే!: రెజీనా

ABN , First Publish Date - 2022-07-16T02:52:56+05:30 IST

డెబ్యూతో మంచి హీరోయిన్‌గా పేరు తెచ్చుకోని, ఆ తర్వాత కెరియర్ డౌన్ ఫాల్ అయిన బ్యూటీ రెజీనా కసాండ్ర (Regina Cassandra). ఇటీవల ‘ఆన్యాస్‌ ట్యుటోరియల్‌’ (Anyas Tutorial) వెబ్‌ సిరీస్‌తో

నేను ప్రెగ్నెంట్ అని చెప్పింది అందుకే!: రెజీనా

డెబ్యూతో మంచి హీరోయిన్‌గా పేరు తెచ్చుకోని, ఆ తర్వాత కెరియర్ డౌన్ ఫాల్ అయిన బ్యూటీ రెజీనా కసాండ్ర (Regina Cassandra). ఇటీవల ‘ఆన్యాస్‌ ట్యుటోరియల్‌’ (Anyas Tutorial) వెబ్‌ సిరీస్‌తో రెజీనా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఆహా’ (Aha)లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ప్రమోషన్లో మాట్లాడిన రెజీనా.. ఒక ఇంటర్వ్యూలో, తాను ఒక టైంలో ప్రెగ్నెంట్ అంటూ అబద్ధం చెప్పాను అనేసింది. దీంతో పెళ్లి కాక ముందే తల్లి అయిన ప్రముఖ హీరోయిన్ అంటూ.. సోషల్ మీడియా సైంటిస్టులు థంబ్నెయిల్స్ పెట్టి, హల్చల్ చేశారు. ఇక చేసేదేమీ లేక, స్వయంగా రెజీనా బయటకి వచ్చి, ఈ ప్రెగ్నెంట్ అనే విషయంలో క్లారిటీ ఇచ్చింది. 


ఈ విషయంపై రెజీనా మాట్లాడుతూ.. ‘‘నాకు ‘మిస్టీ దోయ్’ (Mishti doi) అనే స్వీట్ అంటే చాలా ఇష్టం. ఆ స్వీట్ తిందామని రాత్రి సమయంలో షాప్ దగ్గరకు వెళ్లాను. అయితే అప్పుడే ఆ స్వీట్‌ షాప్‌ కట్టేస్తున్నారు. నేను ఆ షాప్‌ అతన్ని స్వీట్‌ కావాలని అడిగాను. కానీ అతను షాప్‌ క్లోజింగ్ టైం అయ్యింది అని చెప్పాడు, అప్పుడు నేను ప్రెగ్నెంట్‌ (pregnant) అని, మిస్టీ దోయ్ స్వీట్ తినాలనిపిస్తుంది అని అతనితో అన్నాను. ఆ అబద్ధాన్ని నమ్మేసి అతను షాప్ తెరిచి మరీ నాకు ఆ స్వీట్ ఇచ్చాడు. ఇలా ఒక స్వీట్ కోసం నేను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పాల్సి వచ్చింది’’ అంటూ రెజీనా క్లారిటీ ఇచ్చింది. ఒక్క స్వీట్ కోసం రెజీనా చెప్పిన అబద్ధం, ఆమె గురించి సోషల్ మీడియాలో ఏవేవో మాట్లాడే వరకూ తీసుకోని వెళ్ళింది. రెజీనా చెప్పిన విషయం తెలిసిన తర్వాత.. పాపం రెజీనా, స్వీట్ కోసం సోషల్ మీడియాలో తల్లయిపోయింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - 2022-07-16T02:52:56+05:30 IST