Regina Cassandra: మహిళ కాబట్టి వదిలేశా.. మగాడైతే చెంప పగిలేది

ABN , First Publish Date - 2022-09-16T01:10:49+05:30 IST

హీరోయిన్ రెజీనా కసాండ్రా (Regina Cassandra).. హీరోయిన్‌గా ఎన్నో చిత్రాలలో నటించినా.. సరైన బ్రేక్ మాత్రం ఇంత వరకు ఈ అమ్మడికి రాలేదనే చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో..

Regina Cassandra: మహిళ కాబట్టి వదిలేశా.. మగాడైతే చెంప పగిలేది

హీరోయిన్ రెజీనా కసాండ్రా (Regina Cassandra).. హీరోయిన్‌గా ఎన్నో చిత్రాలలో నటించినా.. సరైన బ్రేక్ మాత్రం ఇంత వరకు ఈ అమ్మడికి రాలేదనే చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో మరిచిపోయిన ఈ పేరుని.. ‘మందాకిని’ అంటూ ‘ఆచార్య’ మళ్లీ తెరపైకి తీసుకొచ్చాడు. అయితే ఈ చిత్రం కూడా ఈ భామకి సరైన బ్రేక్ ఇవ్వలేదు సరికదా.. అసలు ఆమె గురించి మాట్లాడుకునే ఛాన్సే లేకుండా చేసింది. ఇక చేసేదేమీ లేక.. ఎలాగోలా ఇండస్ట్రీలో నిలబడేందుకు తన పాట్లు తాను పడుతుంది. అయితే అందుకుగాను ఆమె ఎన్నుకున్న మార్గమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. నివేథా థామస్‌ (Nivetha Thomas)తో కలిసి ఆమె నటించిన చిత్రం ‘శాకిని డాకిని’ (Saakini Daakini). సెప్టెంబర్ 16న థియేటర్లలో విడుదలకాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహిస్తోన్న ప్రమోషన్లలో.. రెజీనా మాట్లాడే తీరు అందరినీ ఆకర్షించడమే కాకుండా.. ఆమె కూడా వార్తలలో నిలిచేలా చేస్తుంది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో ‘మ్యాగీ-మగాడు’ (Maggie-Magaadu) అంటూ ఓ డబుల్ మీనింగ్ జోక్‌తో ఒక్కసారిగా ఆమె టాక్ ఆఫ్ ద సోషల్ మీడియాగా మారింది. ఇప్పుడు ‘లిప్‌లాక్’ అంటూ మరో స్పెషల్ అప్‌డేట్‌ని వదిలి.. ‘శాకిని డాకిని’కి సరిపడా క్రేజ్‌కి కారణమవుతోంది. 


‘మగాళ్లు - మ్యాగీ.. రెండూ ఒకటే. ఎందుకంటే రెండింటికీ రెండు నిమిషాలే..’ అంటూ ఓ అడల్ట్ జోక్‌ పేల్చిన రెజీనా.. తన తాజా ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన ‘లిప్‌లాక్’ అనుభవం చెప్పి.. మరోసారి వార్తలలో నిలుస్తోంది. ‘ఒకసారి నేనేదో వేరే పనిలో ఉండగా.. ఒక మహిళ వచ్చి, నా పెదాలను కిస్ చేసింది. సడెన్‌గా అలా జరగడంతో నేను షాక్ అయ్యాను. కానీ కిస్ చేసింది ఓ మహిళ కావడంతో ఆమెను వెనక్కి నెట్టలేదు.  అయితే అదే పని మగాడు చేసి ఉంటే మాత్రం అక్కడికక్కడే చెంప పగలకొట్టేదానిని..’ అంటూ రెజీనా చెప్పుకొచ్చింది. దీంతో ‘మ్యాగీ-మగాడు’ విషయంలో ఎలా అయితే రెజీనా పేరు వినిపించిందో.. ఈ ‘లిప్‌లాక్’ మ్యాటర్‌తోనూ ఆమె పేరు వైరల్ అవుతోంది. అంతకు ముందు మీడియా సమావేశంలో కూడా ఓ రిపోర్టర్‌ని ప్రశ్నించి ఆమె హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. దీంతో.. ఎప్పుడూ లేనిది.. ఒక్కసారిగా రెజీనాలో ఈ మార్పు ఏమిటా? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ‘శాకిని డాకిని’ సినిమాపైనే తన సినీ భవిష్యత్తు ఆధారపడి ఉండటంతో.. ఆ సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీని ఈ రూపంలో రెజీనా చేసిందని ఇండస్ట్రీ పీపుల్ మాట్లాడుకుంటుండటం విశేషం. (Regina Cassandra Lip-lock)

Updated Date - 2022-09-16T01:10:49+05:30 IST