విభ పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది: బర్త్‌డే బ్యూటీ పూజా హెగ్డే

ABN , First Publish Date - 2021-10-13T02:42:22+05:30 IST

పూజా హెగ్డే ప్రస్తుత క్రేజ్ ఏంటో తెలియంది కాదు. అక్టోబర్ 13 ఆమె జన్మదినం. ఈ సందర్భంగా ఒక రోజు ముందు నుండే ఆమెకు అభిమానులు సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే ఇండస్ట్రీలోని ప్రముఖులు..

విభ పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది: బర్త్‌డే బ్యూటీ పూజా హెగ్డే

పూజా హెగ్డే ప్రస్తుత క్రేజ్ ఏంటో తెలియంది కాదు. అక్టోబర్ 13 ఆమె జన్మదినం. ఈ సందర్భంగా ఒక రోజు ముందు నుండే ఆమెకు అభిమానులు సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే ఇండస్ట్రీలోని ప్రముఖులు శుభాకాంక్సలు తెలుపుతూ ట్వీట్స్ చేస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ.. ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్‌గా కొనసాగుతోంది పూజా హెగ్డే. స్టార్ హీరోలందరితో నటిస్తూ చాలా బిజీతారగా మారిపోయింది. తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరితో జోడి కడుతూ టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది పూజా హెగ్డే. 


ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాధే శ్యామ్’.. అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలతో పాటు తమిళ్‌లో స్టార్ హీరో విజయ్ సరసన ‘బీస్ట్’ చిత్రంలో చేస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రం అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో విభ పాత్రలో నటించింది పూజా. ఇప్పటి వరకు తన కెరీర్లో చేయనటువంటి ఒక హుషారైన పాత్రలో ఇందులో నటించినట్లుగా, ఈ సినిమా తన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని.. ఖచ్చితంగా ఈ చిత్రం విడుదలైన తర్వాత విభ పాత్ర అందరికీ గుర్తుండిపోతుందని చెబుతోంది పూజ. ఈ చిత్రంతో పాటు ఆమె చేస్తున్న అన్ని చిత్రాలు విజయం సాధించాలి, మున్ముందు మరిన్ని మంచి చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆమె అలరించాలని కోరుతూ పూజా హెగ్డేకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

Updated Date - 2021-10-13T02:42:22+05:30 IST