టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అరెస్ట్.. కారణమిదే!

ABN , First Publish Date - 2022-02-19T01:12:29+05:30 IST

టాలీవుడ్‌లో ‘ఈ మాయ పేరేమిటో’, ‘ఏక్ మినీ కథ’ వంటి చిత్రాల్లో నటించిన యంగ్ హీరోయిన్ కావ్యా థాపర్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఆమె మద్యం మత్తులో కారు డ్రైవ్ చేస్తూ.. ఒక వ్యక్తిని గాయపరిచడంతో పాటు..

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అరెస్ట్.. కారణమిదే!

టాలీవుడ్‌లో ‘ఈ మాయ పేరేమిటో’, ‘ఏక్ మినీ కథ’ వంటి చిత్రాల్లో నటించిన యంగ్ హీరోయిన్ కావ్యా థాపర్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఆమె మద్యం మత్తులో కారు డ్రైవ్ చేస్తూ.. ఒక వ్యక్తిని గాయపరిచడంతో పాటు.. పోలీసులను దూషించడం, అవమానపరిచినందుకు కావ్యా థాపర్‌ను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. యాక్సిడెంట్ తర్వాత ఆమె జుహూలోని ఓ హోటల్‌లో కొంతమందితో ఘర్షణ పడుతుండటంతో.. పోలీసులకు హోటల్ సిబ్బంది సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చే సమయానికి ఆమె ఇంకా గొడవ పడుతూనే ఉందని, కలగజేసుకున్న మహిళా పోలీస్‌‌‌ కాలర్ పట్టుకుని తీవ్రంగా దూషించడంతో.. కావ్యా థాపర్‌ను అరెస్ట్ చేసి జుహూ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లుగా ముంబై పోలీస్ జోన్ 9 డీసీపీ మంజునాధ్ షింగే తెలిపారు. ఆమెపై సెక్షన్ 353, 504, 332, 427 ఐపీసీ కింద కేసు నమోదు చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. కాగా, అంధేరీ కోర్ట్‌లో ఆమెను హాజరుపర్చగా.. కోర్టు ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్లుగా సమాచారం. 



Updated Date - 2022-02-19T01:12:29+05:30 IST