గొడవ పెట్టుకుంటానని దర్శకుడిని హెచ్చరించా: యంగ్ హీరోయిన్

ABN , First Publish Date - 2022-02-08T02:44:05+05:30 IST

నిపక్షంలో గొడవ పెట్టుకుంటానని హెచ్చరించాను. ఈ మాటలు తమాషాగా ఆయనతో అన్నాను. కానీ, ఆయన మాత్రం సీరియస్‌గా తీసుకుని, ఈ చిత్రంలో నాకు

గొడవ పెట్టుకుంటానని దర్శకుడిని హెచ్చరించా: యంగ్ హీరోయిన్

కోలీవుడ్‌ యంగ్‌ హీరోయిన్‌ జనని అయ్యర్‌ నటించిన తాజా చిత్రం ‘కూర్మన్‌’. ఈ నెల 11న విడుదలకానుంది. ఈ చిత్రంలో అవకాశం కోసం ఆమె దర్శకుడితో గొడవపడి మరీ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఈ అంశంపై ఆమె మాట్లాడుతూ..‘తెగిడి’ చిత్రం నుంచి దర్శకుడు బ్రియాన్‌ బి.జార్జ్‌ బాగా తెలుసు. దర్శకుడిగా సినిమా తీస్తే మాత్రం అందులో హీరోయిన్‌గా తనకే అవకాశం ఇవ్వాలని, లేనిపక్షంలో గొడవ పెట్టుకుంటానని హెచ్చరించాను. ఈ మాటలు తమాషాగా ఆయనతో అన్నాను. కానీ, ఆయన మాత్రం సీరియస్‌గా తీసుకుని, ఈ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చారు. ఇందులోని నా పాత్ర కెరీర్‌ను మలుపు తిప్పేలా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ నచ్చడమే కాదు.. నాకు కూడా మంచి పేరు తెచ్చిపెడుతుంది.. అని వివరించింది.



Updated Date - 2022-02-08T02:44:05+05:30 IST