KGF 2 సినిమాలోని వయలెన్స్ డైలాగ్‌ను పెళ్లి కోసం వాడితే.. వైరల్‌గా మారిన పెళ్లి కార్డు..!

ABN , First Publish Date - 2022-04-21T00:43:05+05:30 IST

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన సినిమా ‘కెజియఫ్: చాప్టర్-2’. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ‘కెజియఫ్-1’కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు

KGF 2 సినిమాలోని వయలెన్స్ డైలాగ్‌ను పెళ్లి కోసం వాడితే.. వైరల్‌గా మారిన పెళ్లి కార్డు..!

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన సినిమా ‘కెజియఫ్: చాప్టర్-2’. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ‘కెజియఫ్-1’కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. పాన్ ఇండియాగా రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న విడుదలైంది. ఈ చిత్రంలో యశ్ నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు అభిమానుల మన్ననలు కూడా దక్కాయి. 


‘కెజియఫ్-2’ సినిమాలోని డైలాగులను హీరో యశే రాశాడు. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూల్లో దర్శకుడైన ప్రశాంత్ నీలే స్వయంగా చెప్పాడు. ఈ సినిమా ట్రైలర్ విడుదలియిన్పటి నుంచే మంచి బజ్ ఉంది. ట్రైలర్‌లో యశ్ చెప్పిన ‘‘వయలెన్స్..వయలెన్స్..వయలెన్స్.. ఐ డోంట్ లైక్ ఇట్. ఐ అవైడ్’’ అనే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ డైలాగ్‌తో అనేక మీమ్స్‌ కూడా వచ్చాయి. అయితే ఇదే డైలాగ్‌ను కర్ణాటకలోని బెళగావికి చెందిన చంద్రశేఖర్‌ పెళ్లి కోసం వాడాడు. తన పెళ్లి పత్రికపై ప్రింట్ చేయించాడు. దీంతో ఆ వెడ్డింగ్ కార్డ్ వైరల్ అవుతోంది. 'మ్యారేజ్‌.. మ్యారేజ్‌.. మ్యారేజ్‌.. ఐ డోంట్‌ లైక్‌ ఇట్‌, ఐ అవైడ్‌, బట్‌ మై రిలేటివ్స్‌ లైక్‌ మ్యారేజ్‌, ఐ కాంట్‌ అవైడ్‌' అని శుభలేఖపై ముద్రించాడు. దీంతో ఈ వెడ్డింగ్‌ కార్డు సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఈ కార్డును చూసిన యశ్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ మూవీ బాలీవుడ్‌లో భారీ వసూళ్లను రాబడుతుంది. విడుదలైన ఆరు రోజుల్లోనే దాదాపుగా రూ. 240కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. బాక్సాఫీస్ వద్ద ఇదే దూకుడును ప్రదర్శిస్తే రాబోయే రోజుల్లో ‘దంగల్’ లైఫ్‌టైమ్ కలెక్షన్లను అధిగమించే అవకాశం ఉందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Updated Date - 2022-04-21T00:43:05+05:30 IST