హీరో విష్ణు విశాల్‌కు కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2022-01-11T02:11:14+05:30 IST

కోలీవుడ్‌ హీరో, నిర్మాత, హైదరాబాద్‌ అల్లుడు విష్ణు విశాల్‌ కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘‘పాజిటివ్‌ రిజల్ట్‌తో 2022ను ప్రారంభిస్తున్నాను. అబ్బాయిలూ.. అవును నాకు పాజిటివ్‌ రిజల్ట్‌..

హీరో విష్ణు విశాల్‌కు కరోనా పాజిటివ్‌

కోలీవుడ్‌ హీరో, నిర్మాత, హైదరాబాద్‌ అల్లుడు విష్ణు విశాల్‌ కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘‘పాజిటివ్‌ రిజల్ట్‌తో 2022ను ప్రారంభిస్తున్నాను. అబ్బాయిలూ.. అవును నాకు పాజిటివ్‌ రిజల్ట్‌ వచ్చింది. గత వారంలో నన్ను కలిసిన, సంప్రదించిన ఎవరైనా దయచేసి జాగ్రత్త వహించండి. కొవిడ్‌ పరీక్షలు చేయించుకోండి. త్వరలో బౌన్స్‌ బ్యాక్‌ అవుతా’’ అంటూ విష్ణు విశాల్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, కోలీవుడ్‌కు చెందిన సీనియర్‌ నటుడు సత్యరాజ్‌, హీరోయిన్‌ త్రిష, దర్శకుడు ప్రియ దర్శన్‌, సంగీత దర్శకుడు థమన్‌ ఇలా అనేక మంది కొవిడ్‌ బారినపడిన విషయం తెలిసిందే. కాగా, హీరో విష్ణు విశాల్‌ హైదరాబాద్‌కు చెందిన టెన్నిస్‌ క్రీడాకారిని గుత్తా జ్వాలను గత యేడాది రెండో పెళ్ళి చేసుకున్నారు.



Updated Date - 2022-01-11T02:11:14+05:30 IST