ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాను: Vishal

ABN , First Publish Date - 2022-07-07T21:01:50+05:30 IST

యాక్షన్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నటుడు విశాల్ (Vishal). అనేక సినిమాలతో తెలుగువారికి కూడా చేరువయ్యాడు. ‘పందెం కోడి’, ‘డిటెక్టివ్’, ‘పూజై’ వంటి సినిమాలతో

ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాను: Vishal

యాక్షన్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నటుడు విశాల్ (Vishal). అనేక సినిమాలతో తెలుగువారికి కూడా చేరువయ్యాడు. ‘పందెం కోడి’, ‘డిటెక్టివ్’, ‘పూజై’ వంటి సినిమాలతో అభిమానులను అలరించాడు. సినిమాల్లో కష్టతరమైన ఫైట్స్‌ను కూడా డూప్ లేకుండానే సొంతంగా చేస్తుంటాడు. ఈ ఏడాది చిత్రీకరణల్లో పాల్గొంటూ దాదాపుగా మూడు సార్లు గాయడపడ్డాడు. గతవారం కూడా ‘లాఠీ’ (Laththi) సెట్‌లో గాయపడి ఆస్పత్రిలో చేరాడు.  


నడిగర్ సంఘం భవనం పూర్తయిన అనంతరమే పెళ్లి చేసుకునే ఆలోచనలో విశాల్ ఉన్నాడు. కానీ, కరోనా, ఆర్థిక కారణాలు, కోర్టు కేసులతో ఆ బిల్డింగ్ పనులు ముందుకు సాగడం లేదు. అనీషా అల్లారెడ్డితో 2019లో ఈ స్టార్ హీరోకు నిశ్చితార్థం అయింది. ఏమైందో తెలియదు కానీ ఆరునెలల అనంతరం వారు విడిపోయారు. కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్(Varalaxmi Sarathkumar)తో అతడు రిలేషన్ షిప్ కొనసాగించాడని గతంలో పుకార్లు షికార్లు కొట్టాయి. విశాల్ తాజాగా ప్రేమపై తనకున్న అభిప్రాయాలను వ్యక్తపరిచాడు. పెద్దలు కుదిర్చిన వివాహం తనకు సరిపోదని తెలిపాడు. ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు చెప్పాడు. ఆమెకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తానన్నాడు. ఇక కెరీర్ విషయనికి వస్తే.. విశాల్ ప్రస్తుతం ‘లాఠీ’, ‘మార్క్ ఆంటోనీ’ (Mark Antony)సినిమాల్లో నటిస్తున్నాడు. ‘మార్క్ ఆంటోనీ’ కి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘తూప్పరివాలన్-2’(Thupparivalan-2)తో విశాల్ దర్శకుడిగా కూడా మారబోతున్నాడు.



Updated Date - 2022-07-07T21:01:50+05:30 IST