Hero Surya's response: మంచి చిత్రాల్లో నటించేలా ప్రోత్సాహం

ABN , First Publish Date - 2022-07-24T16:41:35+05:30 IST

తాను నటించిన ‘సూరరైపోట్రు’ చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డుకు ఎంపిక చేయడంపై హీరో సూర్య(Hero Surya) స్పందించారు. ఇదే

Hero Surya's response: మంచి చిత్రాల్లో నటించేలా ప్రోత్సాహం

                      - ‘జాతీయ అవార్డు’పై హీరో సూర్య స్పందన


అడయార్‌(చెన్నై), జూలై 23: తాను నటించిన ‘సూరరైపోట్రు’ చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డుకు ఎంపిక చేయడంపై హీరో సూర్య(Hero Surya) స్పందించారు. ఇదే విషయంపై ఆయన శనివారం ఒక  ప్రకటన విడుదల చేశారు. ‘ఈ జాతీయ అవార్డు గుర్తింపుతో పాటు మంచి చిత్రాల్లో నటించేలా ప్రోత్సహించే విధంగా ఉంది. నన్ను ఈ అవార్డు(Award)కు ఎంపిక చేసిన జ్యూరీ కమిటీ సభ్యులకు, కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ‘సూరరైపోట్రు’ వంటి చిత్రాన్ని నటించేందుకు నిర్మించేందుకు ఒత్తిడి చేసిన నా భార్య జ్యోతిక(My wife is Jyothika)కు, నా పిల్లలు దియా, దేవ్‌లకు, ‘నేరుక్కునేర్‌’ చిత్రంలో నా మీద నమ్మకంతో హీరోగా పరిచయం చేసిన దర్శకుడు వసంత్‌ సాయి, నిర్మాత, దర్శకుడు మణిరత్నంకు ఈ శుభతరుణంలో ధన్యావాదాలు. అన్ని వేళలా దిశానిర్దేశం చేస్తూ, ప్రేమ చూపుతున్న నా తల్లిదండ్రులు(my parents), కార్తీ, బృంద తదితర కుటుంబ సభ్యులకు ధన్యావాదాలు. నాతో పాటు జాతీయ అవార్డులు గెలుచుకున్న దర్శకురాలు సుధా కొంగర, జీవీ ప్రకాష్‌, అపర్ణా బాలమురళి, సహ నిర్మాత రాజశేఖర్‌ కర్పూర పాండ్యన్‌లకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-24T16:41:35+05:30 IST