Sudheer Babu: ‘బ్రహ్మాస్త్ర’ ఆఫర్ వచ్చింది, కానీ కుదరలేదు

ABN , First Publish Date - 2022-09-15T22:57:18+05:30 IST

బ్రహ్మాస్త్ర (Brahmastra) సినిమా కలెక్షన్స్ (Box Office) మీద, సినిమా హిట్ అయిందా లేక పోయిందా అనే విషయంపై ఇంకా ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ గోల ఇలా ఉంటే..

Sudheer Babu: ‘బ్రహ్మాస్త్ర’ ఆఫర్ వచ్చింది, కానీ కుదరలేదు

బ్రహ్మాస్త్ర (Brahmastra) సినిమా కలెక్షన్స్ (Box Office) మీద, సినిమా హిట్ అయిందా లేక పోయిందా అనే విషయంపై ఇంకా ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.  ఈ గోల ఇలా ఉంటే.. టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు (Sudheer Babu) తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం చెప్పాడు. అదేంటీ అంటే, ‘బ్రహ్మాస్త్ర’ సినిమా ఆఫర్ ముందు తనకి వచ్చిందట, కానీ ఆయన వదులుకున్నాడట. ఎందుకంటే.. సుధీర్ బాబు అప్పుడు తెలుగు సినిమాలతో బిజీగా ఉండటం వల్లే.. ఆ సినిమా ఆఫర్ వదులుకున్నాడట. సుధీర్ బాబు నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ (Aa Ammayi Gurinchi Meeku Cheppali) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెపుతూ ఆయన ఈ విషయం వెల్లడించాడు. 


బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయా? అంటే.. బ్రహ్మాస్త్ర ఆఫర్ వచ్చింది కానీ వదిలేసుకున్నా అని చెప్పాడు. అప్పుడు ‘సమ్మోహనం’ సినిమా ఉండటం, అలాగే పుల్లెల గోపీచంద్ బయోపిక్ చర్చల్లో  కూడా ఉండటం కారణంగానే ‘బ్రహ్మాస్త్ర’ వదిలేసుకున్నానని చెప్పాడు. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా గురించి మాట్లాడుతూ.. ఇందులో ఆయన ఒక కమర్షియల్ సినిమా డైరెక్టర్ పాత్రలో కనిపిస్తానని చెప్పాడు.  దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ (Indraganti Mohana Krishna) ఆ పాత్రని చాలా వైవిధ్యంగా డిజైన్ చేశాడని సుధీర్ బాబు చెప్పారు. ఈ సినిమాలో కృతి శెట్టి (Krithi Shetty) కథానాయికగా నటిస్తోంది. ఆమె మంచి నటి అని కృతి శెట్టిని సుధీర్ బాబు ప్రశంసించాడు.

Updated Date - 2022-09-15T22:57:18+05:30 IST