నటుడు సుధాకర్ కోమాకుల (Sudhakar Komakula) దంపతులకు మగబిడ్డ జన్మించాడు. శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (Life Is Beautiful) సినిమాతో నటుగా తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమయ్యాడు సుధాకర్ కోమాకుల. ఈ సినిమాతో మంచి పేరే తెచ్చుకున్నాడు. అయితే, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫ్లాపవడంతో ఆ తర్వాత ఆశించిన అవకాశాలు దక్కలేదు. నువ్వు తోపురా (Nuvvu Thopu Raa), కుందనపు బోమ్మ (Kundanapu Bomma) లాంటి చిత్రాలలో లీడ్ రోల్స్ చేసి ఆకట్టుకున్నాడు.
ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజ, శృతి హాసన్ జంటగా నటించిన క్రాక్, యువ నటుడు కార్తికేయ హీరోగా నటించిన రాజా విక్రమార్క చిత్రాలలో మంచి పాత్రలనే పోషించాడు. కాగా, సుధాకర్ కోమాకులకు హారిక సందెపోగు (Harika Sandepogu)తో వివాహం జరిగింది. ఈ దంపతులకు మగబిడ్డ జన్మిచాడు. ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో ఫొటోను షేర్ చేశారు. ఈ సందర్భంగా తమ బిడ్డకు 'రుద్ర కోమాకుల' (Rudra Komakula) అని నామకరణం చేసిన విషయాన్ని తెలిపారు.
ప్రస్తుతం సుధాకర్ కోమకుల దంపతులు చికాగోలో ఉన్నారు. ఈ నెల 14వ తేదీన బాబు జన్మించాడని ..తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు.. అని తెలిపారు. అలాగే, 'రుద్ర' అంటే చెడును తరిమికొట్టేవాడు.. స్తుతించదగినవాడు, శివుని యొక్క మరొక పేరు మరియు రూపం'..అని పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇక సుధాకర్ కోమాకుల - హారికల పెళ్ళిరోజుకు సరిగ్గా వారంముందు బాబు పుట్టడంతో కుటుంబసభ్యులంతా ఆనందంతో ఉప్పొంగిపోయారు. కాగా, ఈ విషయం తెలిసిన నెటిజన్స్ సుధాకర్ కోమాకుల దంపతులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.