Macherla Niyojakavargam: నితిన్ మొదలెట్టాడు

ABN , First Publish Date - 2022-07-16T22:47:58+05:30 IST

నితిన్ (Nithiin) హీరోగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి (MS Raja Shekhar Reddy) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam). ప్రస్తుతం ఈ చిత్రానికి

Macherla Niyojakavargam: నితిన్ మొదలెట్టాడు

నితిన్ (Nithiin) హీరోగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి (MS Raja Shekhar Reddy) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam). ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా హీరో నితిన్  హైదరాబాద్‌లో నూతనంగా ప్రారంభమైన పప్పు స్టూడియో (Pappu Studio)లో ఈ చిత్ర డబ్బింగ్‌ని మొదలెట్టారు. ఈ స్టూడియోలో మొదట డబ్బింగ్ జరుపుకుంటున్న చిత్రం ఇదే  కావడం విశేషం. శ్రేష్ట్ మూవీస్ (Sreshth Movies) బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి (Sudhakar Reddy), నికితారెడ్డి (Nikitha Reddy) ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో భారీ నిర్మాణ ప్రమాణాలు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం రూపొందుతోంది. నితిన్ సరసన  కృతిశెట్టి (Krithi Shetty), కేథరిన్ థ్రెసా (Catherine Tresa) కథానాయికలుగా నటిస్తున్నారు. 


పొలిటికల్ ఎలిమెంట్స్‌తో మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు ఇస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన ‘రారా రెడ్డి’ చార్ట్ బస్టర్‌గా నిలుస్తూ.. యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్, లైక్స్‌తో ట్రెండింగ్‌లో వుంది. అలాగే చిత్రంలో విలన్‌గా ‘రాజప్ప’ (Rajappa) పాత్రలో నటిస్తోన్న సముద్రఖని (Samuthirakani) లుక్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇంకా రెగ్యులర్ అప్‌డేట్స్‌తో సినిమాపై మరింతగా క్రేజ్ పెంచాలని మేకర్స్ భావిస్తున్నారు. కాగా, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ వ్యవహరిస్తోన్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు.


‘పప్పు స్టూడియో’ ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) చేతుల మీదగా ‘పప్పు స్టూడియో’ శనివారం గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ప్రముఖ డబ్బింగ్ ఇన్‌ఛార్జ్ బి. శ్రీనివాస్ అలియాస్ పప్పుకి చెందిన నూతన డబ్బింగ్ కార్యాలయాన్ని చిరంజీవి, సురేఖ (Surekha) దంపతులతో పాటు హీరో నితిన్ కూడా కలిసి ప్రారంభించారు. ఇదే స్టూడియోలో హీరో నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రానికి సంబంధించి డబ్బింగ్ స్టార్ట్ చేశారు.





Updated Date - 2022-07-16T22:47:58+05:30 IST