Karthikeya 3: ఈసారి మాములుగా ఉండదు

ABN , First Publish Date - 2022-09-22T21:19:27+05:30 IST

హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddhartha) ఇప్పుడు స్టార్ హీరోనే కాదు పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఆయన హీరోగా నటించిన ‘కార్తికేయ 2’ (karthikeya 2) చిత్రం ఊహించని

Karthikeya 3: ఈసారి మాములుగా ఉండదు

హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddhartha) ఇప్పుడు స్టార్ హీరోనే కాదు పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఆయన హీరోగా నటించిన ‘కార్తికేయ 2’ (karthikeya 2) చిత్రం ఊహించని విధంగా విజయం సాధించి.. బాలీవుడ్‌ (Bollywood)లో సైతం అతని పేరు వినబడేలా చేసింది. బాలీవుడ్‌ డైరెక్ట్ సినిమాలకు పోటీ ఇస్తూ.. ‘కార్తికేయ 2’ సృష్టించిన ప్రభంజనం ఏమిటో.. హిందీ బెల్ట్‌లో ఆ సినిమా సాధించిన కలెక్షన్లే చెబుతున్నాయి. ‘కార్తికేయ’ (Karthikeya) చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం అంతగా ప్రేక్షకులలోకి వెళ్లిపోయింది. ‘కార్తికేయ 2’నే కాదు.. దానికి కూడా కొనసాగింపు ఉంటుందనేలా ఇప్పటికే దర్శకుడు చందూ మొండేటి (Chandoo Mondeti) క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం ‘కార్తికేయ 3’ (Karthikeya 3)కి సంబంధించిన కథని కూడా సిద్ధం చేసే పనిలో ఆయన నిమగ్నమై ఉన్నట్లుగా టాక్ నడుస్తోంది. 


ఇదిలా ఉంటే.. ‘కార్తికేయ 3’కి సంబంధించి హీరో నిఖిల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడి.. ఈసారి రాబోయే పార్ట్ మాములుగా ఉండదు అనేలా హింట్ ఇచ్చేశాడు. ప్రస్తుతం నిఖిల్ ‘18 పేజెస్’ (18 pages) అనే చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కూడా నిఖిల్ సరసన అనుపమా పరమేశ్వరనే (Anupama Parameswaran) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు నిఖిల్ ‘స్పై’ (Spy) అనే పాన్ ఇండియా (Pan India) సినిమాలోనూ నటిస్తున్నాడు. అయితే ఈ రెండు సినిమాల కంటే కూడా ఇప్పుడు ‘కార్తికేయ 3’పైనే ఆయన ఫోకస్ పెట్టినట్లుగా.. ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడిన తీరు చూస్తుంటే తెలుస్తుంది.


‘‘కార్తికేయ, కార్తికేయ 2 చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రేక్షకులకు మా ప్రయత్నం నచ్చినందుకు మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. వారి దీవెనలతో త్వరలోనే ‘కార్తికేయ 3’కి శ్రీకారం చుట్టబోతున్నాం. ఈ సినిమా ఎప్పుడు మొదలుపెడతామో, ఎప్పుడు పూర్తి చేస్తామో.. అనే దానిపై నేను కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఈసారి చేయబోయే పార్ట్ 3D వెర్షన్‌లో ఉండబోతుంది’’ అని నిఖిల్ చెప్పుకొచ్చారు. ఆయన ‘కార్తికేయ 3’పై ఇచ్చిన హింట్‌తో.. ఇప్పుడా పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటం విశేషం. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే మాత్రం.. నిఖిల్, చందూ మొండేటిపై పార్ట్ 3కి సంబంధించి ప్రెజర్ ఎక్కువయ్యే అవకాశాలైతే లేకపోలేదు. చూద్దాం.. ‘కార్తికేయ 3’ ఏ రూపంలో, ఎప్పుడు మొదలవ్వబోతోందో? (Nikhil Karthikeya 3 Movie Update)

Updated Date - 2022-09-22T21:19:27+05:30 IST