Jalsa4K: పవన్ కళ్యాణ్ కోసం నిఖిల్ త్యాగం

ABN , First Publish Date - 2022-08-31T02:20:17+05:30 IST

నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) నటించిన ‘కార్తికేయ 2’ (Karthikeya 2) సినిమా ఇప్పటికీ బాగానే ఆడుతోంది. ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా మొత్తం భారతదేశం అంతా విడుదలై..

Jalsa4K: పవన్ కళ్యాణ్ కోసం నిఖిల్ త్యాగం

నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) నటించిన ‘కార్తికేయ 2’ (Karthikeya 2) సినిమా ఇప్పటికీ బాగానే ఆడుతోంది. ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా మొత్తం భారతదేశం అంతా విడుదలై సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాని పొగుడుతూ సినిమా ఇండస్ట్రీలో చాలామంది పెద్దలు మాట్లాడారు కూడా. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (Powerstar Pawan Kalyan) కూడా ఈ సినిమా గురించి, నిర్మాతలు, దర్శకుడు, ఇందులోని నటీనటుల గురించి ఒక లెటర్ కూడా రాశారు. నిఖిల్‌కి మొదటి నుండి పవన్ కళ్యాణ్ అంటే ఎంతో గౌరవం. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా.. ఆయన అభిమానులు కళ్యాణ్ పాత సినిమా ‘జల్సా’ని మళ్లీ విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన ఈ జల్సా ఆటలు ప్రదర్శిస్తున్నారు. 


అయితే హైదరాబాద్‌లో దేవి 70MM (Devi 70MM) సినిమా హాల్‌లో నిఖిల్ సినిమా ‘కార్తికేయ2’ ఆడుతోంది. కానీ నిఖిల్ తన సినిమా బాగా ఆడుతున్నా కూడా, అది తీసేసి పవన్ కళ్యాణ్ సినిమా ‘జల్సా’ వేసుకోవడానికి ఆ థియేటర్ యాజమాన్యంతో మాట్లాడి ఒప్పించారు. తన సినిమా కలెక్షన్స్ బాగున్నా, ఒక్క షో కలెక్షన్ పోయినా పరవాలేదు కానీ.. పవన్ కళ్యాణ్ అభిమానులని నిరాశ పరచకూడదనే ఉద్దేశంతో తన సినిమా రద్దు చేసుకొని ‘జల్సా’కి చోటిచ్చాడు నిఖిల్. ఇప్పుడతని ఉదారతని కళ్యాణ్ అభిమానులు పొగడకుండా ఉండలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా నిఖిల్‌కి పవన్ కళ్యాణ్ అభిమానులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కాగా, దేవి థియేటర్‌తో పాటు పక్కన సుదర్శన్ థియేటర్‌లో కూడా ‘జల్సా’ (Jalsa) షో వేస్తున్నారు. ఇప్పటికి ప్రపంచ వ్యాప్తంగా 516  స్క్రీన్స్‌లో జల్సా విడుదల ఖరారైందని.. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుందని పవన్ కళ్యాణ్ అసోసియేషన్ ప్రతినిధి ప్రదీప్ రెడ్డి (Pradeep Reddy) చెప్పారు.

Updated Date - 2022-08-31T02:20:17+05:30 IST