Nikhil Siddharth: రూ. 1116లతో మొదలై.. రూ. 100 కోట్ల వరకు..

ABN , First Publish Date - 2022-08-28T06:17:57+05:30 IST

సినిమా.. ఇది కొందరికి వ్యాపారం, ఇంకొందరికి వ్యాపకం.. మరికొందరికి జీవితం. ఎన్నో కలలతో ఈ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఆ కలలను సాకారం చేసుకోలేక వెనుదిరిగేవారు ఎందరో ఉన్నారు. ఏదిఏమైనా ఇక్కడే ఉండి సాధించాలని

Nikhil Siddharth: రూ. 1116లతో మొదలై.. రూ. 100 కోట్ల వరకు..

సినిమా.. ఇది కొందరికి వ్యాపారం, ఇంకొందరికి వ్యాపకం.. మరికొందరికి జీవితం. ఎన్నో కలలతో ఈ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఆ కలలను సాకారం చేసుకోలేక వెనుదిరిగేవారు ఎందరో ఉన్నారు. ఏదిఏమైనా ఇక్కడే ఉండి సాధించాలని బలంగానమ్మి కష్టపడేవారు చాలా తక్కువమందే ఉన్నారు. అందులో ఒకరు హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth). ఒక వెయ్యి నూట పదహారు రూపాయలతో మొదలైన ఆయన సినీ ప్రయాణం.. నేడు వందకోట్లకు చేరుకుంది.. అంటే దీని వెనుక ఎంత కృషి, పట్టుదల ఉందో అర్థం చేసుకోవచ్చు. 


సినీ ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా అడుగుపెట్టి.. మొట్టమొదటి పారితోషికంగా రూ. 1116 అందుకున్న నిఖిల్ (Nikhil).. సుఖంగా బతకడానికి అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా.. వాటిని వదిలేసి.. కేవలం ఈ పారితోషికంతోనే అసిస్టెంట్ డైరెక్టర్ కష్టాలు పడుతూ, ‘హ్యాపీ డేస్’ (Happy Days) సినిమాతో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని రాజేష్ పాత్రతో తెలుగు ప్రేక్షకులలో ఒక గుర్తింపును సాధించాడు. ఆ గుర్తింపును కాపాడుకుంటూ.. మూసధోరణి సినిమాలు చేయకుండా.. వైవిధ్యమైన కథలతో తనని తాను ఒక సెల్ఫ్ మేడ్ స్టార్‌గా మలుచుకున్నాడు. ‘స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’ వంటి యూనిక్ కాన్సెప్ట్ సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక ఐడెంటిటీని ఏర్పరచుకున్నాడు. సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ పక్కన పెడితే.. నిఖిల్ అంటే కచ్చితంగా కాన్సెప్ట్ బేస్డ్ సినిమా చేస్తాడనే పేరుని.. వైవిధ్యత ఉంటుందనే మార్క్‌ని వేయించుకోగలిగాడు. (Hero Nikhil Cine Journey)


‘అర్జున్ సురవరం’ (Arjun Suravaram) సినిమాతో మంచి హిట్ అందుకున్న నిఖిల్.. ఇప్పుడు ‘కార్తికేయ-2’ (Karthikeya 2) సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరిన సందర్బంగా జరిగిన ఈవెంట్‌లో కూడా అభిమానుల మధ్యకు వెళ్లి కూడా నిఖిల్ ముచ్చటించటం జరిగింది. 

కేవలం తెలుగు ప్రేక్షకుల దగ్గరే గుర్తింపు ఉన్న నిఖిల్ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ (bollywood) ప్రేక్షకులు వద్ద కూడా మంచి గుర్తింపును పొందాడు. దీనికి ‘కార్తికేయ 2’ సినిమాకు వస్తున్న కలెక్షన్లే నిదర్శనం. తెలుగు పాన్ ఇండియా స్టార్స్‌లో ఇప్పుడు నిఖిల్‌ది ఐదవ స్థానం. అయితే ఈ సక్సెస్ ఒక్క రాత్రో.. లేదంటే ఒక్క పగలో వచ్చినది కాదు.. దీని వెనుక ఎన్నో ఏళ్ళ కష్టం ఉంది, శ్రమ ఉంది. కష్టపడితే ఎప్పటికైనా ఫలితం దక్కుతుంది అనడానికి నిదర్శనం నిఖిల్ జర్నీనే. చాలామందికి ఇది ఆశ్చర్యకరమైన విషయం.. కానీ ఈ కార్తికేయుడికి ఇది సాధించాలకున్న విజయం. ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమ కష్టకాలంలో ఉన్న సమయంలో.. మరోసారి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రాన్ని అందించిన నిఖిల్‌పై ఇప్పుడు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

Updated Date - 2022-08-28T06:17:57+05:30 IST