Diamond Rajaతో వరుణ్ సందేశ్ ట్రాక్‌‌లోకి వస్తాడు: నిఖిల్

ABN , First Publish Date - 2022-08-07T01:53:04+05:30 IST

‘డైమండ్ రాజా’ (Diamond Raja) చిత్రంతో వరుణ్ సందేశ్ (Varun Sandesh) కూడా ట్రాక్‌లోకి రావడమే కాకుండా.. రాక్ చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు యంగ్ హీరో నిఖిల్ (Nikhil). తాజాగా ‘డైమండ్ రాజా’ చిత్రంలోని

Diamond Rajaతో వరుణ్ సందేశ్ ట్రాక్‌‌లోకి వస్తాడు: నిఖిల్

‘డైమండ్ రాజా’ (Diamond Raja) చిత్రంతో వరుణ్ సందేశ్ (Varun Sandesh) కూడా ట్రాక్‌లోకి రావడమే కాకుండా.. రాక్ చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు యంగ్ హీరో నిఖిల్ (Nikhil). తాజాగా ‘డైమండ్ రాజా’ చిత్రంలోని ‘ఆకాశమే నువ్వని’ (Aakashame Nuvvani) సాంగ్‌ని నిఖిల్ విడుదల చేశారు. ‘హ్యాపీడేస్’ (Happy Days) చిత్రంలో వరుణ్ సందేశ్, నిఖిల్ కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో వరుణ్ సందేశ్ చిత్రాలేవీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. మరో వైపు నిఖిల్ తన కెరీర్‌ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ.. యంగ్ హీరోలలో టాప్ ప్లేస్‌లో దూసుకెళుతున్నాడు. వీరిద్దరూ మళ్లీ ‘డైమండ్ రాజా’ కోసం ఒకే వేదికపై కనిపించి ‘హ్యాపీడేస్’ మెమరీస్‌ను గుర్తు చేసుకున్నారు. ఇక ‘డైమండ్ రాజా’ విషయానికి వస్తే.. వరుణ్ సందేశ్, డాలీషా (Dollysha) జంటగా శ్రీ ఓబుళేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకత్వంలో తమటం కుమార్ రెడ్డి , బి క్రాంతి ప్రభాత్ రెడ్డి  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని  అచ్చు రాజమణి (Achu Rajamani) స్వరాలు అందించిన ‘ఆకాశమే నువ్వని’ పాటని.. హీరో నిఖిల్ విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పాటని సిద్ శ్రీరామ్ (Sid Sriram), చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) ఆలపించగా... రాంబాబు గోశాల (Rambabu Goshala) సాహిత్యం అందించారు.


పాట విడుదల అనంతరం నిఖిల్ మాట్లాడుతూ.. ‘‘నేను, వరుణ్.. వారం క్రితం ఒక పార్టీలో కలిశాం. ఒక పాట వినిపించాడు. అద్భుతంగా వుంది. ఎవరి సినిమా అని అడిగితే నాదే అన్నాడు. లాంచ్ ఎప్పుడు , ఎవరు లాంచ్ చేస్తున్నారని అడిగితే నువ్వే అన్నాడు. సిద్ శ్రీరామ్ , చిన్మయ పాపులర్ గాయకులు. అద్భుతంగా పాడారు. రాంబాబు చక్కగా రాశారు. ఈ పాట పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం వుంది. వరుణ్ చాలా బావున్నాడు. హిట్లు, ఫ్లాపులు కామన్. ఒక్క హిట్టుతో మళ్ళీ కమ్ బ్యాక్ కావచ్చు. డైమండ్ రాజాతో వరుణ్ కూడా ట్రాక్‌లోకి వచ్చి.. ఇండస్ట్రీని రాక్ చేయాలని కోరుకుంటున్నాను. దర్శక, నిర్మాతలకు, చిత్ర యూనిట్ మొత్తానికి  ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు.


వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. ‘‘నిఖిల్ ఈ పాట విన్నారు. అతనికి చాలా నచ్చింది. ఈ వేడుకకి వచ్చి మాకు సపోర్ట్ ఇచ్చినందుకు థాంక్స్.  నా కెరీర్లో ‘అరెరే, నిజంగా, ఏమంటావే’ పాటలు తర్వాత ఈ పాట కూడా అంతే సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాను. అచ్చు అద్భుతమైన పాట చేశారు. సిద్ శ్రీరామ్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. నాకు ఫస్ట్ టైం పాడారు. చిన్మయి‌గారు కూడా అద్భుతంగా పాడారు. డైమండ్ రాజా చేయడానికి కారణం శ్రీనివాస్‌గారు చెప్పిన కథ. చాలా బావుంది. కామెడీ చాలా రోజులుగా చేయలేదు. ‘ఎవరైనా ఎప్పుడైనా’ సినిమాకి సుకుమార్‌గారు కాల్ చేసి ఫెర్ఫార్మెన్స్ సూపరని చెప్పారు. అది మర్చిపోలేను. ‘డైమండ్ రాజా’ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది. దర్శకనిర్మాతలకు, ఇతర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు’’ అని తెలిపారు. 



Updated Date - 2022-08-07T01:53:04+05:30 IST