Nikhil: ఇలాంటి చిత్రాలను ఎంకరేజ్ చేయండి

ABN , First Publish Date - 2022-07-31T00:22:57+05:30 IST

ప్రియాంక డే (Priyanka Dey) టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘హసీన’ (Haseena). సాయి తేజ గంజి (Ganji Saiteja), థన్వీర్, శివ గంగా, ఆకాష్ లాల్, వశిష్ణ నారాయణ, అభినవ్, శ్రేష్ట ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రం సినిమాను నవీన్ ఇరగాని

Nikhil: ఇలాంటి చిత్రాలను ఎంకరేజ్ చేయండి

ప్రియాంక డే (Priyanka Dey) టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘హసీన’ (Haseena). సాయి తేజ గంజి (Ganji Saiteja), థన్వీర్, శివ గంగా, ఆకాష్ లాల్, వశిష్ణ నారాయణ, అభినవ్, శ్రేష్ట ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రం సినిమాను నవీన్ ఇరగాని (Naveen Eragani) దర్శకత్వంలో ఎస్ రాజశేఖర్ రెడ్డి, తన్వీర్ ఎండీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టెక్నికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రంలోని రాహుల్ సిప్లిగుంజ్ (Rahul Sipligunj) ఆలపించిన ‘హ్యాపీ బర్త్‌డే మామ’ (Happy Birthday Mama ) పాటను మేకర్స్  విడుదల చేశారు. ఈ పాటకు షారుక్ షేక్ (Shahrukh Shaik) ట్యూన్‌ను కంపోజ్ చేయగా.. ప్రసాద్ నల్ల  సాహిత్యాన్ని అందించారు. ఈ పాటను యంగ్ హీరో నిఖిల్ (Nikhil) విడుదల చేశారు. పాట విడుదల అనంతరం హీరో నిఖిల్  మాట్లాడుతూ.. ‘‘ఈ పాటను చూస్తుంటే.. కొత్త వాళ్లు చేసినట్టుగా లేదు. ఎంతో అద్భుతంగా ఉంది. ఇలాంటి కొత్త జానర్‌లో సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి చిత్రాలను అందరూ ఆదరించాలి. ఈ పాటను విడుదల చేసినందుకు ఆనందంగా ఉంది. టీజర్, ట్రైలర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. నేను కూడా సినిమాను చూస్తాను. కొత్త వాళ్లను, కొత్త జానర్‌‌లను అందరూ ఎంకరేజ్ చేయాలి..’’ అని అన్నారు.


డైరెక్టర్ నవీన్ ఇరగాని మాట్లాడుతూ.. ‘‘మా సినిమాలోని పాటను హీరో నిఖిల్‌గారు విడుదల చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా లాంటి కొత్తవాళ్లకు నానిగారు, నిఖిల్‌గారు, రవితేజగారిలాంటి వాళ్లే స్పూర్తి. ఈ సందర్భంగా త్వరలో విడుదల కాబోతోన్న నిఖిల్‌గారి ‘కార్తికేయ 2’ చిత్రం భారీ విజయం సాధించాలని మా టీమ్ అంతా కోరుకుంటుంది. ప్రస్తుతం ‘హసీన’ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల వివరాలను తెలియజేస్తాం..’’ అని అన్నారు. ఇంకా హీరో సాయితేజ, హీరోయిన్ ప్రియాంక మాట్లాడుతూ.. పాటను విడుదల చేసిన నిఖిల్‌కు, అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.



Updated Date - 2022-07-31T00:22:57+05:30 IST