హీరో మహేష్‌బాబుకు మాతృవియోగం

Twitter IconWatsapp IconFacebook Icon

హీరో మహేష్‌బాబుకు మాతృవియోగం

టాలీవుడ్‎లో(Tollywood) మరో విషాదం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్‌బాబుకు(Superstar Mahesh Babu) మాతృవియోగం కలిగింది. సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ(Superstar Ghattamaneni Krishna) సతీమణి శ్రీమతి ఇందిరాదేవి(Indira Devi) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరాదేవి నివాసంలోనే తుది శ్వాస విడిచారు. కృష్ణా ఇందిరాదేవికి ఐదుగురు సంతానం. రమేష్‌బాబు, మహేష్‌బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. 

ఇందిరాదేవి మృతితో ఘటమనేని కుటుంబంతో పాటు..టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రిన్స్ మహేష్ బాబు..ఇందిరాదేవి బర్త్ డే రోజున, మదర్స్ డే రోజున, విమెన్స్ డే రోజున ప్రత్యేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తనకు తల్లి పట్ల ఉన్న మమకారాన్ని అభిమానులతో పంచుకునేవారు. కాగా, ఇటీవల కాలంలోనే...విజయ నిర్మల(Vijay Nirmala), రమేష్ బాబు(Ramesh Babu) మృతితో దిగాలు చెందుతున్న ఘట్టమనేని ఫ్యామిలీలో.. ఇప్పుడు ఇందిరాదేవి మరణం మరింత బాధాకరమైన విషయం.

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.