Dheera: దసరా స్పెషల్‌గా ప్రీ లుక్.. ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?

Twitter IconWatsapp IconFacebook Icon
Dheera: దసరా స్పెషల్‌గా ప్రీ లుక్.. ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?

రొటీన్ సినిమాలను కాకుండా విభిన్నమైన కథలను అందిస్తేనే థియేటర్లకు వస్తున్నారు. ప్రేక్షకులను మెప్పించే విభిన్నమైన కథతో వస్తున్న యంగ్ హీరో లక్ష్ చదలవాడ (Laksh Chadalavada). ‘వలయం’ (Valayam), ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ (Gangster Gangaraju) చిత్రాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న లక్ష్ చేస్తున్న చిత్రం ‘ధీర’ (Dheera). సరికొత్త కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి విక్రాంత్ శ్రీనివాస్ దర్శకుడు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లుగా మేకర్స్ తెలుపుతున్నారు. ఇక విజయదశమిని పురస్కరించుకుని ఈ చిత్ర ప్రీ లుక్‌ని మేకర్ష్ వదిలారు. ఈ ప్రీ లుక్‌ మంచి స్పందనను రాబట్టుకుంటోంది. (Dheera Pre Look)


చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ని.. హీరో లక్ష్ చదలవాడ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 9న ఉదయం 9 గంటలకు విడుదల చేయబోతోన్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. తాజాగా వదిలిన ప్రీ లుక్‌లో లక్ష్ చదలవాడ యాక్షన్‌లోకి దిగుతున్నట్లుగా అనిపిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. కాగా, పలు సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన సాయి కార్తీక్ ఈ సినిమాకు బాణీలు కడుతున్నారు. నేహా పతన్, సోన్యా భన్సాల్, మిర్చి కిరణ్, హిమజ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

TAGS: Laksh Dheera
AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.