పవన్ కల్యాణ్ టు మహేశ్ బాబు.. Adivi Seshకి హెల్ప్ చేసిన హీరోలు

ABN , First Publish Date - 2022-05-18T01:58:56+05:30 IST

కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ అయిన అడివి శేష్ (Adivi Sesh) నటిస్తున్న తాజా చిత్రం ‘మేజర్’ (Major). పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా

పవన్ కల్యాణ్ టు మహేశ్ బాబు.. Adivi Seshకి హెల్ప్ చేసిన హీరోలు

కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ అయిన అడివి శేష్ (Adivi Sesh) నటిస్తున్న తాజా చిత్రం ‘మేజర్’ (Major). పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా జూన్ 3వ తేదీన విడుదల కానుంది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్‪ని చిత్రయూనిట్ మొదలెట్టింది. అందులో భాగంగా ఇటీవల ఒక షోలో అడివి శేష్ మాట్లాడుతూ.. తన కెరియర్‪లో బాగా హెల్ప్ అయిన హీరోల గురించి చెప్పుకొచ్చారు. 


ముఖ్యంగా పవన్ కళ్యాణ్‪ (Pawan Kalyan)తో నటిస్తున్నప్పుడు... ఆయన ఎంత పెద్ద స్టార్ అయినా, ఆర్టిస్ట్‪కి ఇచ్చిన ఫ్రీడమ్ గురించి అడివి శేష్ స్పెషల్‪గా చెప్పుకొచ్చారు. ‘బాహుబలి’ (Babubali) టైంలో ప్రభాస్ (Prabhas) ఇచ్చిన సపోర్ట్, ‘క్షణం’ (Kshanam) మూవీ విషయంలో అల్లు అర్జున్ (Allu Arjun) చేసిన హెల్ప్, ‘మేజర్’ (Major) సినిమాని మహేశ్ బాబు (Mahesh Babu) ప్రొడ్యూస్ చేయడం... ఇలా శేష్ తన సినిమా లైఫ్‪లో తనకి అండగా నిలబడిన ప్రతి హీరో గురించి స్పెషల్‪గా తెలిపారు. 


ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చినా, ఇండస్ట్రీలోని ప్రతి హీరో తనకి సపోర్ట్‪గా ఉన్నాడని శేష్ చెప్పిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఇక మేజర్ మూవీ ముంబై 26/11 హీరో అయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) కథతో తెరకెక్కిన సినిమా. రీసెంట్‪గా విడుదలైన ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్‪ని రాబట్టుకుంది. ఇదే జోష్‪లో శేష్ కాన్ఫిడెంట్‪గా రిలీజ్‪కి రెడీ అవుతున్నారు. షూర్ షాట్ సమ్మర్ హిట్‪గా మేజర్ ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో, ఆడియన్స్‪లో నమ్మకం కలిగించింది.

Updated Date - 2022-05-18T01:58:56+05:30 IST