నాకు ఆ హీరోలా.. ఎవరితో ఎఫైర్స్ లేవు: అడవి శేష్ (OHRK Promo)

ABN , First Publish Date - 2022-06-18T01:04:05+05:30 IST

‘మేజర్’ (Major) చిత్రంతో పాన్ ఇండియా (Pan India) వైడ్‌గా విజయాన్ని సొంతం చేసుకున్న హీరో అడివి శేష్ (Adivi Sesh). 26/11 ముంబై దాడులలో దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన బ్రేవ్ హార్ట్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌..

నాకు ఆ హీరోలా.. ఎవరితో ఎఫైర్స్ లేవు: అడవి శేష్ (OHRK Promo)

‘మేజర్’ (Major) చిత్రంతో పాన్ ఇండియా (Pan India) వైడ్‌గా విజయాన్ని సొంతం చేసుకున్న హీరో అడివి శేష్ (Adivi Sesh).  26/11 ముంబై దాడులలో దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన బ్రేవ్ హార్ట్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌ (Major Sandeep Unnikrishnan)కు ఘనమైన నివాళిగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో సందీప్ ఉన్నికృష్ణన్‌గా అడివి శేష్ నటించారు. సందీప్‌గా అడివి శేష్ నటనకు ప్రేక్షకులు, విమర్శకులు నీరాజనాలు పలుకుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర విజయానందంలో ఉన్న అడివి శేష్.. ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ (Open Heart With RK) కార్యక్రమంలో పాల్గొని.. తనకి సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో..


* ‘‘మా తెలుగు వాడు.. హిందీకి వెళ్లి సాధించాడని అంతా అంటుంటే చాలా గర్వంగా ఉంది. 

* ఓవర్ నైట్ సక్సెస్ కావడానికి 10 సంవత్సరాలు పట్టింది.

* అమెరికాను ఓన్ చేసుకోలేకపోయాను.. దానికి కారణం నా నరనరాల్లో ఇండియా ఇమిడిపోయి ఉందేమో..

* అమెరికా నుండి వచ్చాక, నేను మాట్లాడే విధానం చూసి.. కామెడీ చేస్తుంటే, దానిని నేను మార్చుకున్నా.

* చిరంజీవిగారికి, మహేష్ బాబుగారికి అభిమానులు ఎలా ఉంటారో.. నేను మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌గారికి అభిమానిని. ఇప్పుడాయన ఫ్యామిలీ నన్ను కొడుకులా భావిస్తోంది.

* పెళ్లి చేసుకోమంటూ ఇంట్లో ఒకటే ఒత్తిడి.. ఇప్పుడు అమ్మాయి అయితే చాలు అనే స్టేజ్‌కి వచ్చేసింది.

* పెళ్లి విషయం వచ్చిన ప్రతిసారి.. ఇండస్ట్రీలో ఇంకా చాలా మంది ఉన్నారు. సల్మాన్ ఖాన్ వంటి వారున్నారు అని చెబుతుంటాను. ఆయనలా నాకు మాత్రం ఎవరితో ఎఫైర్స్ లేవు. (నవ్వుతూ..)

* అమెరికాలో ఉన్నప్పుడు ప్రేమలో కాస్త దెబ్బతిన్నా.. నా పుట్టినరోజు నాడే.. ఆమెకి పెళ్లి జరిగింది.

* అక్కడ చెడు ఉంది.. అంటే.. ఆ పరిసరాల్లో నేను కనిపించను

* నాకు ఎటువంటి చెడు అలవాట్లు లేవు

* నాకు ఏదైనా నచ్చిందీ అంటే.. దానిని ఎక్కువగా చేసేందుకు ఇష్టపడతాను

* తగిలించుకుంటే.. వదిలించుకోవడం కష్టం..’’ ఇలా ఎన్నో విషయాలు అడివి శేష్ చెప్పుకొచ్చారు. ఇంకా ఇండస్ట్రీపరంగా ఆయన ఎంతో ఆవేదనతో ఉన్నట్లుగా కూడా తెలిపారు. ఆ విషయంతో పాటు.. తను చెప్పే మరిన్ని విషయాలు తెలియాలంటే ఆదివారం రాత్రి 8గంటల 30 నిమిషాలకు ABN ఆంధ్రజ్యోతి ఛానల్‌లో ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.

Updated Date - 2022-06-18T01:04:05+05:30 IST