హీరో ఆది సాయికుమార్‌కు జోడీ కుదిరింది

ABN , First Publish Date - 2022-03-11T22:50:09+05:30 IST

యంగ్ హీరో ఆది సాయికుమార్ హీరోగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ ఓ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌కి 10వ చిత్రంగా కాగా

హీరో ఆది సాయికుమార్‌కు జోడీ కుదిరింది

యంగ్ హీరో ఆది సాయికుమార్ హీరోగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ ఓ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌కి 10వ చిత్రంగా కాగా, ఈ చిత్రంతో ఫణికృష్ణ సిరికి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన కథానాయికను ఎంపిక చేసినట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఆది సాయికుమార్‌కి జోడీగా ఈ చిత్రంలో దిగంగనా సూర్యవంశీని ఖ‌రారు చేశారు. తెలుగు, హిందీ భాషలలో కొన్ని ఆసక్తికరమైన చిత్రాలలో న‌టిస్తున్న దిగంగనకు స్వాగతం పలుకుతూ చిత్రయూనిట్ శుభాకాంక్ష‌లు తెలిపింది.


ఇంతకుముందు దిగంగన సూర్యవంశీ టాలీవుడ్‌లో హిప్పీ, సిటీమార్, వలయం వంటి చిత్రాలలో నటించింది. ఇప్పుడు ఆది సాయికుమార్ చిత్రంతో పాటు.. సందీప్ కిషన్ హీరోగా చేస్తున్న చిత్రంలోనూ ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా, ఇంకా పేరు పెట్టని ఆది సాయికుమార్ చిత్రానికి ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందిస్తుండగా, సతీష్ ముత్యాల కెమెరా బాధ్యత‌లు నిర్వహిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్‌ సమర్పిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను చిత్రయూనిట్ ప్రకటించనుంది.



Updated Date - 2022-03-11T22:50:09+05:30 IST