‘ఆర్ఆర్ఆర్’ సినిమా వల్లే.. ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా, విక్కీ పెళ్లికి వెళ్లలేకపోయిందటా..!

ABN , First Publish Date - 2021-12-09T19:20:43+05:30 IST

అందాల తార కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ పెళ్లి చేసుకోతున్నారనే వార్త ప్రస్తుతం బాలీవుడ్ ట్రైండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

‘ఆర్ఆర్ఆర్’ సినిమా వల్లే.. ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా, విక్కీ పెళ్లికి వెళ్లలేకపోయిందటా..!

అందాల తార కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ పెళ్లి చేసుకోతున్నారనే వార్త ప్రస్తుతం బాలీవుడ్ ట్రైండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ డిస్ట్రిక్ట్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ హోటల్‌, బర్వారాలో జరుగబోతున్న వీరి మ్యారేజ్‌కి ఎంతోమంది బాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు.


కత్రినా కైఫ్ మాజీ ప్రియుడు రణ్‌బీర్ కపూర్ ప్రస్తుత ప్రియురాలు అలియా భట్ అని అందరికి తెలిసిందే. ఈ బ్యూటీకి విక్యాట్ పెళ్లి ఆహ్వానం అందిందని సమాచారం. కానీ ఈ భామ డిసెంబర్ 8న కూడా ముంబైలోనే ఉంది. దీంతో పెళ్లికి వెళ్లట్లేదా అంటూ విపరీతంగా ట్రోల్ చేశారు నెటిజన్లు.


దీనిపై అలియా భట్ దగ్గరి వ్యక్తి ఒకరు స్పందించారు. ‘రతన్ పోర్‌లో జరగనున్న పెళ్లికి కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ నుంచి అలియా భట్‌కి ఇన్విటేషన్ అందింది. అప్పుడే ఆమె మ్యారేజ్‌కి వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే అప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ లాంచ్‌ కోసం డెట్స్ ఇచ్చేసింది.  కానీ అది లేట్ అవడంతో పెళ్లికి వెళ్లలేకపోతోంద‌’ని చెప్పుకొచ్చారు.


అయితే, ముంబైలో జరగనున్న విక్యాట్ గ్రాండ్ రిసెప్షన్‌కి బి-టౌన్‌లోని చాలామంది సెలబ్రిటీలు హాజరుకానుండగా.. అలియా కూడా ఆ కార్యక్రమంలో సందడి చేయనుందని సమాచారం. కాగా, విక్కీతో కలిసి ‘రాజీ’ మూవీలో.. ఫరాన్ అక్తర్ దర్శకత్వంలో రానున్న ‘జీ లే జరా’ సినిమాలో కత్రినా కైఫ్‌లో నటించనుంది అలియా.

Updated Date - 2021-12-09T19:20:43+05:30 IST