VV Vinayak: శిష్యుడి ‘గీత’కి సపోర్ట్‌గా..

ABN , First Publish Date - 2022-10-12T00:45:21+05:30 IST

గ్రాండ్ మూవీస్ పతాకంపై ఆర్. రాచయ్య నిర్మించిన విభిన్న కథాచిత్రం ‘గీత’ (Geetha). ‘మ్యూట్ విట్నెస్’ అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. హీరోయిన్ హెబ్బా పటేల్..

VV Vinayak: శిష్యుడి ‘గీత’కి సపోర్ట్‌గా..

గ్రాండ్ మూవీస్ పతాకంపై ఆర్. రాచయ్య నిర్మించిన విభిన్న కథాచిత్రం ‘గీత’ (Geetha). ‘మ్యూట్ విట్నెస్’ అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. హీరోయిన్ హెబ్బా పటేల్ (Hebah Patel) టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రంలో సునీల్ (Sunil) ముఖ్యపాత్ర పోషించగా.. ‘నువ్వే కావాలి, ప్రేమించు’ వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించిన సాయి కిరణ్ (Sai Kiran) విలన్‌గా నటించారు. రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి (30 ఇయర్స్), తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్, సూర్య, లలిత, ప్రియ తదితరులు ఇతర పాత్రలలో నటించారు. దర్శక సంచలనం వి.వి. వినాయక్ (VV Vinayak) ప్రియశిష్యుడు విశ్వ (Viswa) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోన్న సందర్భంగా చిత్రయూనిట్‌కు దర్శకుడు వి.వి. వినాయక్ శుభాకాంక్షలు తెలిపారు.


ఈ సందర్భంగా వి.వి. వినాయక్ మాట్లాడుతూ.. ‘‘నా శిష్యుడు విశ్వకు మంచి పేరు, నా మిత్రుడు రాచయ్యకు డబ్బు తెచ్చే మంచి చిత్రంగా ఈ సినిమా నిలవాలని కోరుకుంటున్నాను. యూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు’’ అని అన్నారు. వి.వి. వినాయక్ వంటి దర్శకుడు తమ చిత్రానికి ఆశీస్సులు అందించడమే కాకుండా.. సినిమా ఘన విజయం సాధించాలని కోరుకోవడం పట్ల నిర్మాత రాచయ్య, దర్శకుడు విశ్వ సంతోషం వ్యక్తం చేశారు. సినిమా చాలా బాగా వచ్చిందని, ప్రతి ఒక్కరినీ మెప్పిస్తుందని.. అందరూ ఈ సినిమాని థియేటర్లలో చూసి ఆశీర్వదించాలని.. వారు కోరారు. (Geetha Ready to Release)

Updated Date - 2022-10-12T00:45:21+05:30 IST