Bigg Boss 5 Telugu: మానస్, సిరికి ఛాన్స్ లేనట్లే!.. విజేత అతడే కావచ్చు..

ABN , First Publish Date - 2021-12-20T00:47:56+05:30 IST

బిగ్‌బాస్‌ సీజన్-5 విజేత ఎవరో ఆదివారంతో తెలిసిపోనుంది. అయితే చాలా రోజులుగా ఈ షోను వీక్షిస్తున్న అభిమానుల్లో విజేత ఎవరనే అంశంపై ఆసక్తి నెలకొంది. గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన షూటింగ్ శనివారం పూర్తైంది. టాప్ 5నుంచి..

Bigg Boss 5 Telugu: మానస్, సిరికి ఛాన్స్ లేనట్లే!.. విజేత అతడే కావచ్చు..

బిగ్‌బాస్‌ సీజన్-5 విజేత ఎవరో ఆదివారంతో తెలిసిపోనుంది. అయితే చాలా రోజులుగా ఈ షోను వీక్షిస్తున్న అభిమానుల్లో విజేత ఎవరనే అంశంపై ఆసక్తి నెలకొంది. గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన షూటింగ్ శనివారం పూర్తైంది. టాప్ 5నుంచి సిరి ఎలిమినేట్ అయినట్లుగా టాక్ వినిపిస్తుంది. అలాగే మానస్ కూడా ఎలిమినేట్ అయినట్లు సమాచారం వస్తోంది. డైరెక్టర్‌ సుకుమార్‌ డ్రోన్ల ద్వారా సిరి ఎలిమినేషన్‌ను ప్రకటించగా హీరోయిన్‌ సాయిపల్లవి చేతుల మీదుగా మానస్‌ ఎలిమినేషన్‌ను వెల్లడించనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.


కంటెస్టెంట్ల డ్యాన్సులతో పాటు ఫైనలిస్టుల్లో నుంచి ఇద్దరిని ఎలిమినేట్‌ చేసే ప్రక్రియను శనివారమే షూట్‌ చేశారు. దీంతో కొందరికి విషయం ఒక రోజు ముందే తెలిసిపోయింది. సిరి 5వ స్థానంలో నిలవగా.. మానస్ నాల్గవ స్థానంలో నిలిచినట్లుగా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ముందుగా డైరెక్టర్ సుకుమార్ డ్రోన్స్ ద్వారా సిరి ఎలిమినేషన్ వార్తను ప్రకటిస్తాడని.. తర్వాత మానస్ ఎలిమినేట్ అయినట్లు, హీరోయిన్ సాయి పల్లవి ప్రకటిస్తుందని చెబుతున్నారు. ఎలిమినేషన్‎కు పది లక్షలు ఆఫర్ చేయగా సిరితో పాటూ మానస్ కూడా తిరస్కరించినట్లు తెలుస్తోంది.


అయితే ఎలిమినేషన్ ఆఫర్‌ను రెట్టింపు చేస్తే టాప్‌-3లో ఉన్న షణ్ను, సన్నీ, శ్రీరామ్‌లో.. ఎవరో ఒకరు తీసుకుంటారని సమాచారం. ఇదిలావుండగా, శ్రీరామ్, సన్నీ, షణ్ముఖ్ మధ్య గట్టి పోటీ నడుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఒకరు విజేత కావచ్చని టాక్ వినిపిస్తోంది. మరోవైపు సన్నీ విన్నర్, శ్రీరామ్ రన్నర్.. అంటూ ఒక రోజు ముందే పుకార్లు షికారు చేశాయి. బిగ్‌బాస్‌ సీజన్-5 టైటిల్ విన్నర్‌కు రూ. 50 లక్షల ప్రైజ్ మనీ, ట్రోఫీతో పాటూ ఓ బైక్‌ను కూడా అందిస్తారు. అదేవిధంగా రన్నరప్‌కు రూ.25 లక్షలు అందించనున్న విషయం తెలిసిందే.

Updated Date - 2021-12-20T00:47:56+05:30 IST