అర్థ నగ్న మోడల్‌లతో మంగళ సూత్రాన్ని ఈ విధంగా అమ్మడం ఏవరైనా చూశారా.. సబ్యసాచిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామంటున్న మంత్రి

ABN , First Publish Date - 2021-10-31T21:17:16+05:30 IST

బాలీవుడ్ సెలెబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్‌లల్లో సబ్యసాచి ముఖర్జీ ఒకరు. అతడు ఈ మధ్య చేసిన యాడ్ క్యాంపెయిన్ ఒకటి తీవ్ర వివాదస్పదమయింది. నెట్టింట్లో రచ్చకెక్కింది.

అర్థ నగ్న మోడల్‌లతో మంగళ సూత్రాన్ని ఈ విధంగా అమ్మడం ఏవరైనా చూశారా.. సబ్యసాచిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామంటున్న మంత్రి

బాలీవుడ్ సెలెబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్‌లల్లో సబ్యసాచి ముఖర్జీ ఒకరు. అతడు ఈ మధ్య చేసిన యాడ్ క్యాంపెయిన్ ఒకటి తీవ్ర వివాదస్పదమయింది. నెట్టింట్లో రచ్చకెక్కింది. ఈ ప్రమోషనల్ ఫొటో‌షూట్‌లో మోడల్స్ మంగళ సూత్రం ధరించి కనిపించారు. కొంత మంది ఒంటరిగా మంగళ సూత్రం ధరించగా, మరికొంత మంది అసభ్యకర రీతుల్లో మంగళ సూత్రం ధరించారు. ఫలితంగా నెటిజన్లు సబ్యసాచిని  ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.


‘‘ఇది చూసి లోదుస్తులు, కండోమ్ యాడ్ అనుకున్నారా. కానీ, ఇది సబ్యసాచి మంగళ సూత్ర యాడ్. అతడు మంగళ సూత్ర యాడ్‌కు అర్థ నగ్న మోడల్‌లను ఉపయోగించడం మొదలుపెట్టాడు ’’ అని ఒక నెటిజన్ ట్రోల్ చేశారు. ‘‘ సబ్యసాచి కొత్తగా లో దుస్తుల కలెక్షన్‌ను లాంచ్ చేశాడని నేను అనుకున్నాను. కానీ, ఇది మంగళ సూత్ర యాడ్ అని నేను అనుకోలేదు ’’ అంటూ మరో నెటిజన్ తన స్పందనను తెలిపారు. ‘‘ నువ్వు సిగ్గు లేని రీతిలో మంగళ సూత్రాన్ని అమ్ముతున్నావు ’’ అంటూ  సోషల్ మీడియా యూజర్ ట్రోల్ చేశారు. ఈ లగ్జరీ మంగళ సూత్రాన్ని గోల్డ్‌తో తయారుచేశారు. దీని ధర రూ. 1.65లక్షలుగా నిర్ణయించారు.  


తీవ్ర వివాదస్పదమైన ఈ మంగళ సూత్ర యాడ్‌పై తాజాగా మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తం మిశ్రా స్పందించారు. ఈ యాడ్‌ను 24గంటల్లోగా తొలగించకపోతే అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన అక్టోబర్ 31న ట్వీట్ చేస్తూ..‘‘ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ మంగళ సూత్ర యాడ్ అభ్యంతకరంగా ఉంది. ఇతరుల మనోభవాలను కించపరిచేలా ఉంది. ఈ యాడ్‌ను 24గంటల్లోగా తొలగించక పోతే అతడికి వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని ఆయన చెప్పారు.



Updated Date - 2021-10-31T21:17:16+05:30 IST