ముసలాడు వద్దు... కుర్రాడు ముద్దు... అంటోన్న Miss Universe!

ABN , First Publish Date - 2021-12-25T22:23:51+05:30 IST

21 ఏళ్ల తరువాత మన దేశానికి మిస్ యూనివర్స్ కిరీటాన్ని తిరిగి తీసుకొచ్చింది 21 ఏళ్ల హర్నాజ్ సందూ. అయితే, ఈ యంగ్ ఛంఢీఘర్ బ్యూటీ ఎవర్ని డేట్ చేయటానికి ఇష్టపడుతుంది? బాగా డబ్బున్న సంపన్న వృద్ధుడినా? లేక జీవితంలో స్వయం కృషితో ఎదిగేందుకు తాపత్రయపడుతోన్న కుర్రాడినా?...

ముసలాడు వద్దు... కుర్రాడు ముద్దు... అంటోన్న Miss Universe!

21 ఏళ్ల తరువాత మన దేశానికి మిస్ యూనివర్స్ కిరీటాన్ని తిరిగి తీసుకొచ్చింది 21 ఏళ్ల హర్నాజ్ సందూ. అయితే, ఈ యంగ్ ఛంఢీఘర్ బ్యూటీ ఎవర్ని డేట్ చేయటానికి ఇష్టపడుతుంది? బాగా డబ్బున్న సంపన్న వృద్ధుడినా? లేక జీవితంలో స్వయం కృషితో ఎదిగేందుకు తాపత్రయపడుతోన్న కుర్రాడినా?...


ఓ ఇంటర్వ్యూలో... ‘ఓల్డ్ మ్యాన్ ఆర్ యంగ్ మ్యాన్‘ అన్న ప్రశ్న ఎదురైనప్పుడు నిర్మోహమాటంగా యువకుడే కావాలంది విశ్వ సుందరి. తాను స్వయం కృషితో ఎదిగే కుర్రాడ్నే ఇష్టపడతానని చెప్పిన ఆమె అలాంటి స్ట్రగులింగ్ యంగ్ మ్యాన్ తనకు ఎందుకు కావాలో కూడా చెప్పింది. ‘‘నేను ఎంతో కష్టపడి ఎదిగాను. ఇక ముందు కూడా స్వయం కృషినే నమ్ముకుంటాను’’ అన్న హర్నాజ్ తనలాగా స్వంతంగా ఎదిగేవాడితోనే డేటింగ్ చేస్తానని ప్రకటించింది! ‘‘కష్టపడి సాధించిన విజయాలకే నిజమైన విలువ ఉంటుంది’’ అని కూడా గార్జియస్ పంజాబీ లేడీ చెప్పుకొచ్చింది.


తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ప్రస్తావించిన హర్నాజ్ సందూ ఇంకా క్లియర్ ఐడియా ఏదీ లేదని ఒప్పుకుంటూనే నటిగా మాత్రం కొనసాగుతానని చెప్పింది. ఆమె ఇప్పటికే కొన్ని పంజాబీ సినిమాల్లో నటించింది. సుస్మితా, లారా దత్తా లాంటి మాజీ మిస్ యూనివర్సుల్లాగే ఈమె కూడా సాధ్యమైనంత త్వరగా బాలీవుడ్ బాట పట్టవచ్చు అంటున్నారు...  

Updated Date - 2021-12-25T22:23:51+05:30 IST