Harish Shankar: నా సినిమాలో తెలుగు హీరోయిన్సే ఉండాల‌ని కోరుకుంటా.. కానీ?

ABN , First Publish Date - 2022-12-09T00:09:58+05:30 IST

‘ఓ రైట‌ర్‌గా నాకు సెట్స్‌లో అంద‌రూ తెలుగువాళ్లే ఉండాల‌నిపిస్తుంది..’ అన్నారు దర్శకుడు హరీష్ శంకర్. డా. బ్ర‌హ్మానందం, స్వాతి రెడ్డి, స‌ముద్ర ఖ‌ని, రాహుల్ విజ‌య్‌..

Harish Shankar: నా సినిమాలో తెలుగు హీరోయిన్సే ఉండాల‌ని కోరుకుంటా.. కానీ?

‘ఓ రైట‌ర్‌గా నాకు సెట్స్‌లో అంద‌రూ తెలుగువాళ్లే ఉండాల‌నిపిస్తుంది..’ అన్నారు దర్శకుడు హరీష్ శంకర్. డా. బ్ర‌హ్మానందం, స్వాతి రెడ్డి, స‌ముద్ర ఖ‌ని, రాహుల్ విజ‌య్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, న‌రేష్ అగ‌స్త్య‌, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్ప‌ల త‌దిత‌రులు న‌టిస్తోన్న యాంథాల‌జీ ‘పంచతంత్రం’. టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజిన‌ల్స్ ప‌తాకాల‌పై అఖిలేష్ వ‌ర్ద‌న్‌, సృజ‌న్ ఎర‌బోలు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి హ‌ర్ష పులిపాక ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డిసెంబ‌ర్ 9న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భగా చిత్రయూనిట్ నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ (Harish Shankar) ముఖ్య అతిథిగా హాజరై బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు. (Panchathantram Pre Release Event)


అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘నాకు టికెట్ ఫ్యాక్టరీకి ఏదో తెలియ‌ని అనుబంధం ఉంది. అఖిలేష్‌, భువ‌న్‌తో మంచి అనుబంధం ఉంది. భువ‌న్ నా సోష‌ల్ మీడియా పి.ఆర్ అంతా చూసేవాడు. త‌ను ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా చేయ‌టం మంచి ప‌రిణామం. ఓ రైట‌ర్‌గా నాకు సెట్స్‌లో అంద‌రూ తెలుగువాళ్లే ఉండాల‌నిపిస్తుంది. ఫ‌స్ట్ టేక్‌కి, సెకండ్ టేక్‌కి ఒక్కోసారి నేను డైలాగ్ మార్చేస్తుంటాను. అప్పుడు ప్రిపేర్ కావాలంటూ ముంబై హీరోయిన్స్ ప‌క్క‌కి వెళితే.. నాకు ఇరిటేటింగ్‌గా ఉంటుంది. అందుకే తెలుగు హీరోయిన్స్ ఉండాల‌నే కోరుకుంటాను. అయితే కొన్ని మార్కెట్ ఈక్వెష‌న్స్ బ్యాలెన్స్  చేయాల్సి ఉంటుంది. పంచతంత్రం (Panchathantram) విష‌యానికి వ‌స్తే అంద‌రూ దీన్ని చిన్న సినిమా అంటున్నారు. కానీ... ఇందులో చాలా రిచ్ కంటెంట్ ఉంది. కాబ‌ట్టి దీన్నెవ‌రూ చిన్న సినిమా అని అన‌కండి. మూవీ రిలీజ్ త‌ర్వాత తెలుస్తుంది. డైరెక్ట‌ర్ హ‌ర్ష‌ని చూస్తుంటే నాకు జెల‌సీగా ఉంది. నాకు ఓ క‌థ రాయ‌టానికి రెండు, మూడేళ్లు ప‌డుతుంది. కానీ త‌నేమో ఓ సినిమాలోనే ఐదు క‌థ‌లు రాసేశాడు. పంచ‌తంత్రం చాలా మంచి తెలుగు టైటిల్. స్వాతి (Swathi) నా ఆల్ టైమ్ క్ర‌ష్‌. త‌ను చాలా మంచి న‌టి. శివాత్మిక (Shivathmika) నా పేరెంట్స్ పెద్ద స్టార్స్ అని కాకుండా సినిమాల్లో క‌ష్ట‌ప‌డుతుంటుంది. ఆడిష‌న్స్ ఇస్తుంటుంది. శివానీ (Shivani) కూడా అంతే. ఇద్ద‌రూ డౌన్ టు ఎర్త్‌. ఇద్ద‌రూ బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. రాజ్ కె.న‌ల్లి మంచి విజువ‌ల్స్ కోసం అస్స‌లు కాంప్ర‌మైజ్ కాడు. గొడ‌వైనా ప‌డ‌తాడు. పంచ‌తంత్రం వంటి కంటెంట్ రిచ్ ఫిలింస్ గురించి ప‌ది మందికి చెప్పాలి. ప‌ది మంది గొప్ప‌గా మాట్లాడాలి. డిసెంబ‌ర్ 9న మూవీ రిలీజ్ అవుతుంది. ఇది మ‌నంద‌రి క‌థ‌. మ‌న మ‌ధ్య ఉండే సినిమా. మ‌నంద‌రి పాత్ర‌లు.. ఇలాంటి మంచి సినిమాల‌ను హిట్ చేస్తేనే ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల‌కు ఓ ఇన్‌స్పిరేష‌న్ వ‌స్తుంది. ఇంకా మంచి సినిమాలు వ‌స్తాయి. ఎంటైర్ టీమ్‌కు అభినంద‌న‌లు’’ అన్నారు. (Harish Shankar about Panchathantram)

Updated Date - 2022-12-09T00:09:58+05:30 IST